Game Changer: జనవరి 4న రాజమండ్రిలో ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా అమెరికాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ కావడంతో… ఏపీలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేసింది.
ఈరోజు నిర్మాత దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమై ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీల గురించి చర్చించారు. పవన్ సౌకర్యాన్ని బట్టి జనవరి 4 లేదా 5 తేదీల్లో ఈ వేడుకను నిర్వహిస్తామని దిల్ రాజు ఇప్పటికే తెలిపాడు. ఈరోజు పవన్‌తో మాట్లాడిన తర్వాత ఈవెంట్‌కు జనవరి 4 తేదీని ఖరారు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో భారీ ఎత్తున జరగనుంది.
ఈరోజు మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి వెళ్లిన దిల్ రాజు… పవన్‌తో మాట్లాడారు. రాజమండ్రిలో జరిగే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాల్సిందిగా పవన్‌కు ఆహ్వానం అందింది. ఈ భేటీలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు.
Read : Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ