Sree Vishnu : శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘మృత్యుంజయ్’  టైటిల్‌ టీజర్ విడుదల 

Mruthunjay మూవీ

శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘మృత్యుంజయ్’  టైటిల్‌ టీజర్ విడుదల  తరచుగా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కథానాయకుడు శ్రీ విష్ణు, తన ప్రత్యేకమైన శైలితో యువ హీరోలలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ప్రతిసారి విభిన్నమైన జానర్‌లను ఎంచుకుంటూ, తన నటనతో సినీ ప్రేమికులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరు‌కు పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనదిగా నిలుస్తున్న చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ చిత్రానికి షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. రమ్య గుణ్ణం సమర్పణలో, లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెబా జాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా విడుదల…

Read More

Akshay Kumar : ముందు ‘కన్నప్ప’ సినిమాను తిరస్కరించాను

kannappa akshaykumar

ముందు ‘కన్నప్ప’ సినిమాను తిరస్కరించాను ముంబైలో నిర్వహించిన ప్రత్యేక మీడియా కార్యక్రమంలో ‘కన్నప్ప’ టీజర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అక్షయ్ కుమార్, నటుడు మంచు విష్ణు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ వినయ్ మహేశ్వరి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ అద్భుత విజయాన్ని సాధించింది. ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ ‘కన్నప్ప’ టీజర్ అందరినీ ఆకర్షించింది. అక్కడి మీడియా ప్రతినిధులు టీజర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం విజువల్ మాయాజాలంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘ప్రారంభంలో ‘కన్నప్ప’ ఆఫర్ నాకు వచ్చినప్పుడు రెండు సార్లు తిరస్కరించాను. కానీ భారతీయ సినిమా ప్రపంచంలో శివుడిగా నేను సరిపోయానని విష్ణు ఉంచుకున్న నమ్మకమే…

Read More

Sikandar Teaser: సల్మాన్ ఖాన్ ‘సికింద‌ర్’ టీజ‌ర్ విడుదల

sikandar

స‌ల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో ‘సికింద‌ర్’ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సికిందర్’. భావోద్వేగాలు, యాక్షన్ మేళవించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సల్మాన్ ఖాన్ తన శైలిలోనే పవర్ఫుల్ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టగా, మురుగదాస్ తన టేకింగ్‌తో టీజర్‌ను విశేషంగా మలిచారు. రిచ్ విజువల్స్, గ్రాండ్ ప్రెజెంటేషన్‌తో టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.   Read : Kousalya Supraja Rama Review : కౌసల్య సుప్రజా రామా’ సినిమా రివ్యూ   

Read More

Kousalya Supraja Rama Review : కౌసల్య సుప్రజా రామా’ సినిమా రివ్యూ 

Kousalya Supraja Rama Review

కౌసల్య సుప్రజా రామా’ సినిమా రివ్యూ  కన్నడ చిత్రసీమలో రూపొందిన ‘కౌసల్య సుప్రజా రామా‘ సినిమా, 2023 జులై 28న విడుదలైంది. బీసీ పాటిల్ నిర్మించిన ఈ సినిమాకు శశాంక్ దర్శకత్వం వహించాడు. ప్రధాన పాత్రల్లో డార్లింగ్ కృష్ణ, బృందా ఆచార్య, మిలన్ నాగరాజ్ నటించగా, ఈ చిత్రం కన్నడలో మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం ‘ఈటీవీ విన్’ ద్వారా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. కథ విషయానికి వస్తే… కథ: రామ్ (డార్లింగ్ కృష్ణ) ఓ మధ్య తరగతి యువకుడు. అతని తల్లి కౌసల్య (సుధ బెళవాడి), తండ్రి సిద్ధగౌడ (రంగయన రఘు). సిద్ధగౌడ మద్యం అలవాటుతో కుటుంబాన్ని పట్టించుకోడు. తండ్రి తీరు చూసి పెరిగిన రామ్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తాడు. చిన్నప్పటి నుంచి అతనితో చదువుకున్న మేనత్త కొడుకు సంతోష్ కూడా…

Read More

Pooja Hegde : కూలీ సినిమా నుంచి పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌ విడుదల చేసిన మేకర్స్

Pooja Hegde

కూలీ సినిమా నుంచి పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌ విడుదల చేసిన మేకర్స్ ముద్దుగుమ్మ పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గినప్పటికీ… తమిళ్‌ ఇండస్ట్రీ లో మాత్రం వరుసగా  ఆఫర్లు వస్తున్నాయి. రజనీ కాంత్ మరియు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ‘ సినిమాలో  ఆమె అవకాశాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఆమె ఐటెం సాంగ్ చేస్తోంది. పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ విజయ్‌తో కలిసి ‘నాయగన్’ చిత్రంలో నటిస్తున్నది పూజా హెగ్డే. Read : Shraddha Sreenadh | శ్రద్ధా శ్రీనాధ్ నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ “కలియుగమ్ 2064” సెన్సార్ పూర్తి

Read More

Kubera : శేఖర్ కమ్ముల పాన్ఇండియా చిత్రం ‘కుబేర’ విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్

kubera

శేఖర్ కమ్ముల పాన్ఇండియా చిత్రం ‘కుబేర’   టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో అక్కినేని నాగార్జున, తమిళ హీరో ధనుశ్ నటిస్తున్నారు. అలాగే, రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ విషయాన్ని ప్రత్యేక పోస్టర్ ద్వారా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. తాజాగా విడుదలైన పోస్టర్ ఆసక్తికరంగా రూపొందించబడింది. ఇప్పటికే సినిమా నుండి నాగార్జున, ధనుశ్, రష్మిక వారి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల కాగా, రష్మిక క్యారెక్టర్ గ్లింప్స్ తో పాటు టీజర్ కూడా శ్రోతల ముందుకు వచ్చాయి. ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన సోషల్…

Read More

Prabhudeva : వారసుడు రిషి రాఘవేంద్రను పరిచయం చేసిన ప్రభుదేవా!

prabhudeva

వారసుడు రిషి రాఘవేంద్రను పరిచయం చేసిన ప్రభుదేవా! భారతీయ సినిమా నృత్య చరిత్రలో ప్రభుదేవా పేరు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఒంట్లో ఎముకలున్నాయా లేదా అన్నట్లుగా స్ప్రింగులా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ప్రభుదేవా మాస్టర్‌కు చెందిన ప్రత్యేకత. మైకేల్ జాక్సన్ కు భారతీయ వెర్షన్ గా పేరు పొందిన ప్రభుదేవా, కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా, నటుడిగా, దర్శకుడిగా కూడా తన బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు. తాజాగా, ప్రభుదేవా తన వారసుడిని ఒక ఈవెంట్ లో పరిచయం చేశారు. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో ప్రభుదేవా, ఆయన కొడుకు రిషి రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీలు హాజరై, తండ్రీకొడుకులు కలిసి డ్యాన్స్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసారు. ఈ వీడియోను ప్రభుదేవా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకున్నారు.…

Read More

Kunchacko Boban : ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ .. భారీ వసూళ్లు

officer on duty

‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ .. భారీ వసూళ్లు మలయాళ సినిమాలు చూసే ప్రేక్షకులకు కుంచాకో బోబన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనిపించటానికి హ్యాండ్సమ్ అయినా, మాస్ ఆడియన్స్ నుండి మంచి మద్దతు పొందే హీరోగా ప్రఖ్యాతుడైన ఆయన, తాజా చిత్రంగా ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ‘తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నెల 20వ తేదీన విడుదలైన ఈ చిత్రం, కేవలం 4 రోజులలోనే 20 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమాను 12 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, 4 రోజుల్లోనే లాభాలు సాధించడం, ఈ సినిమా ప్రతి రోజూ వసూళ్లలో పెరుగుదలను నమోదు చేస్తోందని చెబుతున్నారు. ‘నెట్ ఫ్లిక్స్’ ఈ చిత్రానికి స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్నారు, మరియు ఇది వచ్చే నెల 2వ వారంలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం. హరిశంకర్ – గీత…

Read More

Director Ashok : దర్శకుడు అశోక్ ప్రయోగం చేస్తున్న మూవీ ‘ఉఫ్’

nora fatehi

  షూటింగు పూర్తిచేసుకున్న ‘ఉఫ్’ త్వరలో రిలీజ్ కానున్న సినిమా సినిమాకు మంచి డైలాగ్‌లు ఉండాలి … మంచి పాటలు ఉండాలి.  ప్రేక్షకులు ఈ రెండూ లేకుండా సినిమాలు చూడరు.   కానీ ఒక్క సంభాషణ లేని సినిమా త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. ఒక ప్రయోగంగా తయారైన ఆ సినిమా పేరు ‘ఉఫ్ ‘ చాలా కాలం క్రితం, సింగీతం శ్రీనివాస రావు సంభాషణలు లేకుండా ‘పుష్పక విమానా’ చేసాడు. ఇది కమల్ హాసన్ కెరీర్‌లో గొప్ప చిత్రం. ఇప్పుడు ‘ఉఫ్ ‘ అనే సినిమా ప్రేక్షకుల వద్దకు రావడానికి సిద్ధంగా ఉంది. హర్రర్ థ్రిల్లర్ ప్రక్రియలో తయారు చేయబడిన ఈ సినిమాను జి. అశోక్ దర్శకత్వం వహించారు. అశోక్ కెరీర్‌లో ‘పిల్ల జమీందర్’ … ‘భాగమతి’ వంటి హిట్స్ ఉన్నాయి. అతని దర్శకత్వంలో తయారు చేయబడుతున్న…

Read More

RK Roja : బుల్లితెరపై రీఎంట్రీ ఇస్తున్న రోజా

rk roja

 బుల్లితెరపై రీఎంట్రీ ఇస్తున్న రోజా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజా… అందరు అగ్ర హీరోల సరసన నటించారు. ఆ తర్వాత బుల్లితెరపై పలు షోల ద్వారా సందడి చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా జబర్దస్త్ షోలో కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత ఆమె బుల్లి తెరకు దూరమయ్యారు. మంత్రి అయిన తర్వాత రాజకీయాల్లో మరింత బిజీ అయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజా కొన్ని రోజుల పాటు కనిపించలేదు. తాజాగా బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆమె రెడీ అయ్యారు. జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్-4లో హోస్ట్ గా ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో డ్యాన్స్ తో రోజా అలరించారు. రోజాతో పాటు…

Read More