‘ఛావా’ తెలుగు ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక మండన్నా జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఛావా’. మహారాష్ట్ర వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదలై మొదటిరోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ‘ఛావా’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేయనుంది. మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ధైర్యం, కీర్తి మేళవించిన అద్భుత దృశ్యకావ్యంగా రూపొందిన ‘ఛావా’ ట్రైలర్…
Read MoreAuthor: Raghu
Sandeep Reddy Vanga : మాజీ ఐ ఏ యస్ ఆఫీసర్ కి కౌంటర్ ఇచ్చిన డైరక్టర్ సందీప్ వంగా
మాజీ ఐ ఏ యస్ ఆఫీసర్ కి కౌంటర్ ఇచ్చిన డైరక్టర్ సందీప్ వంగా ఢిల్లీకి వెళ్లి ఓ కోచింగ్ సెంటర్‌లో చేరి పుస్తకాలు చదివితే ఐఏఎస్ అవ్వచ్చు, కానీ కేవలం పుస్తకాలు చదివి సినిమా తీయలేరని దర్శకుడు సందీప్ వంగా పేర్కొన్నారు. ఇటీవల ఓ మాజీ ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘12th ఫెయిల్’ చిత్రంలో మాజీ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి యూపీఎస్సీ ప్రొఫెసర్‌గా నటించారు. ఆ సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన వికాస్, ‘యానిమల్’ సినిమాపై విమర్శలు చేశారు. సమాజానికి అలాంటి చిత్రాలు అవసరం లేదని, అవి కేవలం డబ్బు సంపాదనకే ఉపయోగపడతాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విమర్శలపై దర్శకుడు సందీప్ వంగా తాజాగా…
Read MoreRambha : సెకండ్ ఇన్నింగ్స్ కోసం సిద్ధమవుతున్న నటి రంభ
సెకండ్ ఇన్నింగ్స్ కోసం సిద్ధమవుతున్న నటి రంభ 90వ దశకంలో అచ్చమైన తెలుగు అందంతో టాలీవుడ్‌ను ఊపేసిన హీరోయిన్ రంభ. తన అపూర్వ సౌందర్యం, ఆకట్టుకునే నటనతో అగ్రహీరోలందరి సరసన మెరిసింది. తెలుగు కాకుండా, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల్లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. బాలీవుడ్‌లో కూడా తన ముద్ర వేసుకున్న ఆమె, అనంతరం వివాహం చేసుకుని సినిమాలకు విరామం ఇచ్చింది. సినీ పరిశ్రమకు దూరమైనా, అప్పటి ప్రేక్షకులు ఇప్పటికీ రంభను మరిచిపోలేకపోతున్నారు. అప్పటి తరం అభిమానులకు ఆమె ఇప్పటికీ ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పడంలో సందేహమే లేదు. అలాంటి రంభ, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ— సినిమా తన తొలి ప్రేమ అని పేర్కొంది. రీఎంట్రీకి ఇది సరైన సమయమని భావిస్తూ, నటిగా కొత్తగా ఛాలెంజింగ్ రోల్స్ పోషించేందుకు…
Read MoreKannappa : కన్నప్ప టీజర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్
కన్నప్ప టీజర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్ మంచు విష్ణు ప్రధాన పాత్రలో, ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రానికి సంబంధించి కొత్త టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. 84 సెకన్ల నిడివితో విడుదలైన ఈ టీజర్‌లో విష్ణు పవర్‌ఫుల్ నటన, శక్తివంతమైన విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, రివేటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ చివర్లో కనిపించిన ప్రభాస్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన ‘శివ శివ శంకరా’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వివిధ భాషల ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో…
Read MoreSankranthiki Vasthunnam : మార్చి 1న టీవీ, ఓటీటీ ప్రీమియర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా
మార్చి 1న టీవీ, ఓటీటీ ప్రీమియర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని ZEE5, ZEE తెలుగు చానళ్లలో ఒకేసారి ప్రీమియర్‌గా ప్రదర్శించనున్నారు. రేపు (మార్చి 1) సాయంత్రం 6 గంటలకు ఈ వినోదభరిత చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో ఘన విజయం సాధించిన అనంతరం, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ప్రత్యేకంగా ZEE తెలుగులో ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా, ZEE5 ఓటీటీ వేదికపై తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌లను కూడా విడుదల చేస్తున్నారు, తద్వారా విభిన్న భాషల ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు. వెంకటేశ్ స్పందిస్తూ…‘‘ఈ చిత్రంలో రాజు పాత్ర పోషించడం…
Read MoreSree Vishnu : శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల
శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘మృత్యుంజయ్’ టైటిల్ టీజర్ విడుదల తరచుగా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కథానాయకుడు శ్రీ విష్ణు, తన ప్రత్యేకమైన శైలితో యువ హీరోలలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ప్రతిసారి విభిన్నమైన జానర్‌లను ఎంచుకుంటూ, తన నటనతో సినీ ప్రేమికులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరుకు పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనదిగా నిలుస్తున్న చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ చిత్రానికి షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. రమ్య గుణ్ణం సమర్పణలో, లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెబా జాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా విడుదల…
Read MoreAkshay Kumar : ముందు ‘కన్నప్ప’ సినిమాను తిరస్కరించాను
ముందు ‘కన్నప్ప’ సినిమాను తిరస్కరించాను ముంబైలో నిర్వహించిన ప్రత్యేక మీడియా కార్యక్రమంలో ‘కన్నప్ప’ టీజర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అక్షయ్ కుమార్, నటుడు మంచు విష్ణు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ వినయ్ మహేశ్వరి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ అద్భుత విజయాన్ని సాధించింది. ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ ‘కన్నప్ప’ టీజర్ అందరినీ ఆకర్షించింది. అక్కడి మీడియా ప్రతినిధులు టీజర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం విజువల్ మాయాజాలంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘ప్రారంభంలో ‘కన్నప్ప’ ఆఫర్ నాకు వచ్చినప్పుడు రెండు సార్లు తిరస్కరించాను. కానీ భారతీయ సినిమా ప్రపంచంలో శివుడిగా నేను సరిపోయానని విష్ణు ఉంచుకున్న నమ్మకమే…
Read MoreSikandar Teaser: సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ టీజర్ విడుదల
సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో ‘సికిందర్’ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సికిందర్’. భావోద్వేగాలు, యాక్షన్ మేళవించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సల్మాన్ ఖాన్ తన శైలిలోనే పవర్ఫుల్ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టగా, మురుగదాస్ తన టేకింగ్‌తో టీజర్‌ను విశేషంగా మలిచారు. రిచ్ విజువల్స్, గ్రాండ్ ప్రెజెంటేషన్‌తో టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. Read : Kousalya Supraja Rama Review : కౌసల్య సుప్రజా రామా’ సినిమా రివ్యూ
Read MoreKousalya Supraja Rama Review : కౌసల్య సుప్రజా రామా’ సినిమా రివ్యూ
కౌసల్య సుప్రజా రామా’ సినిమా రివ్యూ కన్నడ చిత్రసీమలో రూపొందిన ‘కౌసల్య సుప్రజా రామా‘ సినిమా, 2023 జులై 28న విడుదలైంది. బీసీ పాటిల్ నిర్మించిన ఈ సినిమాకు శశాంక్ దర్శకత్వం వహించాడు. ప్రధాన పాత్రల్లో డార్లింగ్ కృష్ణ, బృందా ఆచార్య, మిలన్ నాగరాజ్ నటించగా, ఈ చిత్రం కన్నడలో మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం ‘ఈటీవీ విన్’ ద్వారా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. కథ విషయానికి వస్తే… కథ: రామ్ (డార్లింగ్ కృష్ణ) ఓ మధ్య తరగతి యువకుడు. అతని తల్లి కౌసల్య (సుధ బెళవాడి), తండ్రి సిద్ధగౌడ (రంగయన రఘు). సిద్ధగౌడ మద్యం అలవాటుతో కుటుంబాన్ని పట్టించుకోడు. తండ్రి తీరు చూసి పెరిగిన రామ్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తాడు. చిన్నప్పటి నుంచి అతనితో చదువుకున్న మేనత్త కొడుకు సంతోష్ కూడా…
Read MorePooja Hegde : కూలీ సినిమా నుంచి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్
కూలీ సినిమా నుంచి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్ ముద్దుగుమ్మ పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గినప్పటికీ… తమిళ్ ఇండస్ట్రీ లో మాత్రం వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రజనీ కాంత్ మరియు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ‘ సినిమాలో ఆమె అవకాశాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఆమె ఐటెం సాంగ్ చేస్తోంది. పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ విజయ్‌తో కలిసి ‘నాయగన్’ చిత్రంలో నటిస్తున్నది పూజా హెగ్డే. Read : Shraddha Sreenadh | శ్రద్ధా శ్రీనాధ్ నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ “కలియుగమ్ 2064” సెన్సార్ పూర్తి
Read More