Chiranjeevi : సునీత విలియమ్స్ గొప్ప ధైర్యవంతురాలు, ఆమెకు సాటి మరెవరూ లేరు : చిరంజీవి

sunitha williams

సునీత విలియమ్స్ గొప్ప ధైర్యవంతురాలు, ఆమెకు సాటి మరెవరూ లేరు : చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి సునీతా విలియమ్స్‌పై ప్రశంసలు కురిపించారు. రోదసిలో 9 నెలలు గడిపిన అనంతరం, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమగాములు ఈ తెల్లవారుజామున భూమికి చేరుకున్న నేపథ్యంలో, చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌కు స్వాగతం పలుకుతూ, ఈ సంఘటనను చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన చిరంజీవి, 8 రోజుల్లో తిరిగి వస్తామన్న వారు 286 రోజుల తర్వాత భూమికి చేరుకున్న విషయాన్ని ప్రస్తావించారు. భూమి చుట్టూ 4,577 సార్లు తిరిగిన ఈ ప్రయాణాన్ని గొప్ప సాహసం అని అభివర్ణించారు. సునీతా విలియమ్స్ ధైర్యసాహసాలకు ఎవ్వరూ సాటి కాదని ప్రశంసించిన ఆయన, ఈ ప్రయాణం ఓ అద్వెంచర్ మూవీని తలపిస్తోందని, నిజమైన బ్లాక్ బస్టర్‌…

Read More

Mahesh Babu Foundation: మ‌హేశ్ బాబు ఔదార్యం.. ఉచితంగా 4,500 హార్ట్ ఆప‌రేష‌న్స్

mahesh babu foundation

మ‌హేశ్ బాబు ఔదార్యం.. ఉచితంగా 4,500 హార్ట్ ఆప‌రేష‌న్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న సమాజ సేవ నిజంగా ప్రశంసనీయం. చిన్నారుల గుండె శస్త్రచికిత్సల కోసం ఉచిత సేవలు అందించడం ద్వారా ఆయన ఎంతో మంది ప్రాణాలను రక్షిస్తున్నారు. 4,500 ఆపరేషన్ల మైలురాయిని చేరుకోవడం నిజంగా గొప్ప విషయం. అలాగే, నమ్రతా శిరోద్కర్ చేపట్టిన మదర్స్ మిల్క్ బ్యాంక్, బాలికలకు గర్భాశయ క్యాన్సర్ టీకా కార్యక్రమం కూడా చాలా కీలకం. ఆరోగ్య సేవల్లో వీరి కృషి మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మహేశ్ బాబు ఫౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరింత విస్తరించాలని కోరుకుందాం! Read : SSMB29 : మొదలైన ఎస్ఎస్ రాజ‌మౌళి, మ‌హేశ్ బాబు కాంబినేషన్ ప్రాజెక్ట్ షురూ

Read More

Tamannaah : జీవితంలో అద్భుతం జరగదు.. మనమే సృష్టించుకోవాలన్న తమన్నా

Tamannaah

జీవితంలో అద్భుతం జరగదు.. మనమే సృష్టించుకోవాలన్న తమన్నా ఇండస్ట్రీలో ఎన్నేళ్లు గడిచినా మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల ఆమె గ్లామర్ డోస్ పెంచడంతో పాటు, స్క్రీన్‌పై మరింత బోల్డ్ అవతార్‌లో కనిపిస్తోంది. ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక గత మూడేళ్లుగా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా, ఇకrelationship ముగిసిందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. “జీవితంలో అద్భుతాన్ని ఎదురుచూడాల్సిన అవసరం లేదు… మనమే సృష్టించుకోవాలి” అంటూ సందేశాన్ని షేర్ చేసింది. అంతేకాదు, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా, రషా థడానీ, ప్రగ్యా కపూర్‌లతో కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. ఈ పోస్టును చూసిన నెటిజన్లు, తమన్నా…

Read More

Gopalakrishnan : మ‌ల‌యాళ ప్ర‌ముఖ ర‌చ‌యిత మంకొంబు గోపాల‌కృష్ణ‌న్ క‌న్నుమూత‌

Gopalakrishnan

గోపాల‌కృష్ణ‌న్ మృతిపై ‘ఎక్స్’ వేదిక‌గా రాజ‌మౌళి సంతాపం మలయాళ ప్రముఖ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ వార్తతో సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. వివిధ చిత్రసీమలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కూడా ఎక్స్ (ట్విట్టర్‌) వేదికగా గోపాలకృష్ణన్ మృతిపట్ల బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగపూరితంగా స్పందించారు. “మంకొంబు గోపాలకృష్ణన్ సర్ మరణవార్త కలచివేసింది. ఆయన రచనలు, కవిత్వం, సంభాషణలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ మలయాళ వెర్షన్ల కోసం ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం చిరస్మరణీయం. ఆయనకు నా హృదయపూర్వక నివాళులు. ఓం శాంతి” అంటూ రాజమౌళి…

Read More

Chiranjeevi : విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి కొత్త చిత్రం

chiranjeevi

విలేజ్ బ్యాక్ డ్రాప్ ;ప చిరంజీవి కొత్త చిత్రం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర నిర్మాణం జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే, చాలా కాలం తర్వాత మళ్లీ పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించనుండడం. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రానికి వినోదం ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. హీరోయిన్‌గా అదితి రావు హైదరీ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదనంగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ ఆల్బమ్ అందించిన సంగీత దర్శకులు భీమ్స్, రమణ గోగుల ఈ సినిమాకు సంగీతం అందించనున్నారని సమాచారం.…

Read More

Amir Khan : ఆమిర్‌తో రిలేష‌న్ షిప్‌పై గౌరీ స్ప్ర‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Gouri amir khan

ఆమిర్‌తో రిలేష‌న్ షిప్‌పై గౌరీ స్ప్ర‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు బాలీవుడ్ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్ తన 60వ జన్మదిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమయంలో ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. గౌరీతో తనకు 25 ఏళ్ల నుంచి స్నేహం ఉన్నప్పటికీ, గత ఏడాది నుంచి వారు డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. బెంగళూరుకు చెందిన గౌరీ ప్రస్తుతం ఆమిర్ ప్రొడక్షన్‌ హౌస్‌లో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంపై నెటిజన్లు ఆసక్తి చూపిస్తూ గౌరీ గురించి తెగ వెతికారు. ఇటీవల ఈ జంట మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా గౌరీ తన సంబంధాన్ని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నాకు దయగల వ్యక్తి, నిజమైన జెంటిల్‌మన్‌, నా పట్ల శ్రద్ధగల…

Read More

Shivaji : హీరోగా రాని స్టార్ డమ్ .. విలన్ గా వచ్చింది: శివాజీ

actor shivaji

ఇకపై పవర్ఫుల్ విలన్ రోల్స్ చేస్తాను : శివాజీ  ‘కోర్ట్’… ఇప్పుడు అందరూ ఈ సినిమానే చర్చించుకుంటున్నారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం, నాని బ్యానర్‌కు భారీ విజయాన్ని అందించింది. ముఖ్యంగా, ఇందులో విలన్ పాత్ర పోషించిన శివాజీకి విపరీతమైన ప్రశంసలు లభించాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ ఈ చిత్రాన్ని గురించి మాట్లాడారు. “గతంలో నేను హీరోగా ఎన్నో సినిమాలు చేశాను. ఎంతో అంకితభావంతో కష్టపడ్డాను, కానీ నేను కోరుకున్న స్టార్‌డమ్ అందుకోలేకపోయాను” అని తెలిపారు. “ఎంతగా శ్రమించినా స్టార్‌డమ్ రాకపోవడంతో నాలో ఆవేదన పెరిగింది. అంతర్మథనం ఎక్కువైంది. అలాంటి సమయంలో నాకు ‘మంగపతి’ పాత్ర ఆఫర్ అయింది. కథ విన్నప్పుడే, ఇదే నా కోసం ఎదురుచూసిన పాత్ర అనిపించింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అంగీకరించాను” అని…

Read More

Arjun Son Of Vyjayanthi Teaser: ఆకట్టుకుంటున్న‌ కల్యాణ్ రామ్ ‘అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి’ టీజ‌ర్..!

arjun sun of vyjanthi

ఆకట్టుకుంటున్న‌ కల్యాణ్ రామ్ ‘అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి’ టీజ‌ర్..! హీరో కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో, కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కల్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టైటిల్ పోస్టర్, అలాగే ఇటీవల విడుదలైన ప్రీ-టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ దృశ్యాలతో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అజనీశ్ లోకనాథ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీజర్‌లో విజయశాంతి పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ వైజయంతిగా కనిపిస్తుండగా, ఆమె కొడుకు…

Read More

Anil Ravipudi : చిరుతో తీయ‌బోయే చిత్రానికి క‌థ‌ను సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి

anil ravipudi

చిరు చిత్రానికి క‌థ‌ను సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి 2026 సంక్రాంతికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. నిన్న ఆయన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా ఆయనతో కలిసి ఉన్నారు. చిరంజీవితో తెరకెక్కించనున్న చిత్రం కోసం స్క్రిప్ట్‌ను స్వామి సన్నిధిలో ఉంచి పూజలు నిర్వహించారు. ఆలయంలోని కప్పస్థంభాన్ని ఆలింగనం చేసుకున్న అనిల్ రావిపూడి, తన పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖను తన సినిమాల కోసం సెంటిమెంట్‌గా భావిస్తానని పేర్కొన్నారు. అందుకే చిరంజీవితో తెరకెక్కించనున్న సినిమా కథ సిద్ధం చేసేందుకు వైజాగ్ వచ్చానని వెల్లడించారు. ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని, ఘరానా మొగుడు, గ్యాంగ్‌లీడర్, రౌడీ అల్లుడు వంటి చిత్రాల్లో…

Read More

Samantha : శుభం సినిమాతో నిర్మాతగా మారిన సమంత

samantha

శుభం సినిమాతో నిర్మాతగా మారిన సమంత ప్రముఖ నటి సమంత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు సెట్స్‌పై లేవు. చివరగా విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమా తరువాత, ఆమె కొత్త ప్రాజెక్ట్‌ అంగీకరించలేదు. ప్రస్తుతం తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో కొత్త చిత్రాలను చేపట్టనుందని సమాచారం. ఇదిలా ఉండగా, సమంత ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలను నిర్మించడం ప్రారంభించారు. ఆమె స్వంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై తొలి చిత్రంగా శుభం అనే తెలుగు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఆమె పూర్తి స్థాయి నిర్మాతగా అరంగేట్రం చేయనున్నారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వసంత్ మరిగంటి కథ అందించారు. పూర్తి వినోదాత్మకంగా ఉండడంతో పాటు…

Read More