Chiranjeevi : ఉగాది రోజున చిరు, అనిల్ రావిపూడి సినిమాకు పూజా కార్యక్రమం

chiranjeevi anil ravipudi

ఉగాది రోజున చిరు, అనిల్ రావిపూడి సినిమాకు పూజా కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి – సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రాబోతోందని తెలిసిందే. ఈ సినిమా గురించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనున్నట్లు సమాచారం. ఈ వార్త మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు-అనిల్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఓరియెంటెడ్ గా ఉండబోతుందని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుండగా, 2026 సంక్రాంతికి విడుదల కావాల్సిన యోచనలో ఉన్నట్లు సమాచారం. షైన్ స్క్రీన్ బ్యానర్…

Read More

Amy Jackson: మరో బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్

amy Jackson

మరో బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్ సినీ నటి అమీ జాక్సన్ మరోసారి తల్లి అయ్యింది. ఆమె ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందకరమైన వార్తను అమీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన కుమారుడికి ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్ విక్ అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది. భర్త, తన బిడ్డతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి, ఈ ప్రత్యేక క్షణాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ వార్తను తెలుసుకున్న అభిమానులు అమీ జాక్సన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అమీ జాక్సన్ సినీ ప్రస్థానం అమీ తొలుత మోడలింగ్ రంగంలో రాణించింది. ఆమె తమిళ సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2010లో విడుదలైన ‘మద్రాస్ పట్టణం’ సినిమాతో సినిమా ప్రపంచంలోకి ప్రవేశించింది. పలు చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా గుర్తింపు…

Read More

Rajendra Prasad : వార్న‌ర్‌పై వ్యాఖ్య‌లు… క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజేంద్ర ప్ర‌సాద్‌

rajendra prasad david warner

‘రాబిన్‌హుడ్’ ఈవెంట్‌లో వార్న‌ర్‌పై రాజేంద్ర ప్ర‌సాద్ అనుచిత వ్యాఖ్య‌లు నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లో ఆదివారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ఆసీస్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వార్నర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీనిపై నెటిజన్లు విమర్శలు చేశారు. తాజాగా ఈ అంశంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. “నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. రాబిన్‌హుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్ గురించి నేను అనుకోకుండా కొన్ని…

Read More

Malavika Mohanan : ప్రభాస్ తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను : మాళవిక మోహనన్

ప్రభాస్ తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను దక్షిణాది చిత్రసీమలో కేరళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2013లో మలయాళ సినిమా ‘పెట్టం పోలె’ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మాళవిక, రెబల్ స్టార్ ప్రభాస్‌కు జోడీగా ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే, తమిళంలో ‘సర్దార్ 2’ సినిమాతో కూడా బిజీగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాళవిక, ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. “ప్రభాస్ మంచితనం, సహృదయతకు నేను ఫిదా అయిపోయాను. ఆయనలాంటి గొప్ప వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఈ సినిమాలో అవకాశం రావడం నాకు లక్కీ ఫీల్ అయ్యింది. ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను” అంటూ మాళవిక చెప్పుకొచ్చింది.…

Read More

Shihan Hussaini : న‌టుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కరాటే గురువు కన్నుమూత‌!

Shihan Hussaini

ప‌వ‌న్ కు మార్ష‌ల్ ఆర్ట్స్, క‌రాటే, కిక్ బాక్సింగ్ లో శిక్షణ ఇచ్చిన హుసైని కోలీవుడ్ ప్రముఖ నటుడు షిహాన్ హుసైని (60) అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. హుసైని మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. హుసైని 1986లో విడుదలైన ‘పున్నగై మన్నన్’ చిత్రంతో కోలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అనేక సినిమాల్లో నటించినప్పటికీ, విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘బద్రి’ సినిమాతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. నటుడిగానే కాకుండా, హుసైని ప్రతిభావంతమైన ఆర్చరీ కోచ్‌గానూ గుర్తింపు పొందారు. 400 మందికి పైగా విద్యార్థులకు ప్రొఫెషనల్ శిక్షణ అందించిన ఆయన, మార్షల్ ఆర్ట్స్‌లో…

Read More

Manchu Vishnu : వీరిలో పెద్ద రౌడీ ఎవరు?

mohan babu

రాంగోపాల్ వర్మ,  మోహన్ బాబు ఫొటోను షేర్ చేసిన మంచు విష్ణు  నటుడు మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, సీనియర్ నటుడు మోహన్ బాబు ముచ్చటిస్తున్న ఓ ఫొటోను షేర్ చేశారు. ఆసక్తికరంగా, వారి పేర్లను మారుస్తూ ‘‘ఈ ఇద్దరితో సాయంత్రం వైల్డ్‌గా సాగింది. మోహన్‌బాబు వర్మ, మంచు రాంగోపాల్! వీరిలో పెద్ద రౌడీ ఎవరు?” అంటూ ఫ్యాన్స్‌ను ప్రశ్నించారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రాంగోపాల్ వర్మ ‘రౌడీ’ అనే సినిమాను మోహన్‌బాబు, విష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించారు. అలాగే, విష్ణును హీరోగా ‘అనుక్షణం’ అనే థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. 2014లో ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడైతే, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో మోహన్‌బాబు కీలక పాత్ర పోషించగా,…

Read More

Priyadarshi : వసూళ్ల పరంగా దూసుకుపోతున్న ‘కోర్ట్’ మూవీ

court movie

రిలీజైన 10 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌కు చేరిన సినిమా ప్రస్తుత సినిమాల ట్రెండ్‌ను పరిశీలిస్తే, పెద్ద తారాగణం లేకపోయినా లేదా భారీ బడ్జెట్‌తో రూపొందించకపోయినా, కథ బలంగా ఉంటే ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్న విషయం స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని నిరూపించే తాజా ఉదాహరణగా నేచురల్ స్టార్ నాని సమర్పణలో, ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన ‘కోర్ట్’ చిత్రం నిలిచింది. ఈ నెల 14న విడుదలైన ‘కోర్ట్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మొదటి రోజే రూ.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, తాజాగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. మొత్తం పది రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం అధికారికంగా ఓ…

Read More

Tuk Tuk Movie : ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ

tuktuk

వెహికల్ చుట్టూ అల్లుకున్న ఫాంటసీ కథ చిన్న సినిమాలకు కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో కొంతమంది దర్శక, నిర్మాతలు ప్రయోగాత్మకంగా ప్రయత్నిస్తున్నారు. అదే కోవలో రూపొందిన చిత్రం ‘టుక్ టుక్‘. ఫాంటసీ, మ్యాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ కథ ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. కథ: ఓ గ్రామంలో ముగ్గురు యువకులు (హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) నిరుద్యోగంగా కాలక్షేపం చేస్తుంటారు. ఓ చెడ్డ పని చేయడానికి డబ్బు అవసరమవడంతో, వినాయక చవితి పేరుతో విరాళాలు సేకరించి, ఆ డబ్బుతో కెమెరా కొనాలని నిర్ణయించుకుంటారు. కానీ అనుకోకుండా, వారి ఆటో-స్కూటర్‌కు మాయశక్తులు వస్తాయి. ఇక ఆ వెహికల్‌కు ఆ శక్తులు ఎలా వచ్చాయి? వాటి ప్రభావం ఏమిటి? వీరి జీవితాల్లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి? మేఘ…

Read More

Mohan Babu : తండ్రి మోహన్ బాబు బర్త్‌డేపై ఎమోషనల్ అయిన మంచు మనోజ్

manchu mohan babu

తండ్రి మోహన్ బాబు బర్త్‌డేపై ఎమోషనల్ అయిన మంచు మనోజ్ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా, ఆయన కుమారుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత సందేశం పోస్ట్ చేశారు. తండ్రికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మనమంతా కలిసి వేడుకలు జరుపుకునే ఈ రోజున, మీ పక్కన ఉండే అవకాశం కోల్పోయాను. మీతో గడిపే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. లవ్ యూ” అంటూ మనోజ్ భావోద్వేగపూరితంగా రాశారు. దీనికి తోడు, ఒక ఫొటోతో పాటు వీడియోను కూడా జోడించారు. ఇటీవల మంచు కుటుంబంలో వివాదాల కారణంగా మనోజ్, మోహన్ బాబు మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన పెట్టిన ఈ పోస్ట్ ప్రత్యేకంగా చర్చనీయాంశంగా…

Read More

Hunt : ఈ నెల 28 నుంచి ఓటీటీ లోకి మలయాళంలో రూపొందిన ‘హంట్’

hunt movie poster

ఓటీటీ లోకి మలయాళం హారర్ మూవీ ‘హంట్’ మలయాళ దర్శకులు క్రైమ్ థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలు తెరకెక్కించే విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అందువల్ల ఆ తరహా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలలో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇదే నేపథ్యంలో, మరో మలయాళ హారర్ థ్రిల్లర్ ‘హంట్’ ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఆగస్టు 23న థియేటర్లలో విడుదలై, మంచి స్పందన పొందింది. ఇప్పుడు, ఈ నెల 28వ తేదీ నుంచి ‘హంట్’ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. కథ & నటీనటులు :ఈ సినిమాలో భావన ప్రధాన పాత్రలో నటించగా, రెంజీ పణిక్కర్, అజ్మల్ అమీర్, చందూనాథ్, అనూ మోహన్, అదితి రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కైలాస్ మీనన్ సంగీతం అందించిన ఈ సినిమా మిస్టరీ, హారర్ ఎలిమెంట్స్‌ కలగలిపిన…

Read More