వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం‘ . అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇంకా ఆశాజనకమైన కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అనిల్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మీ సినిమాలోని కామెడీని కొందరి జబర్దస్త్ స్కిట్లతో పోల్చడంపై మీ స్పందన ఏమిటని అడిగిన ప్రశ్నకు అనిల్, “ప్రేక్షకులు నా ప్రతి సినిమాని ఇష్టపడతారు, నా ప్రతి సినిమాపై ఇలాంటి వ్యాఖ్యలు విని నేను విసిగిపోయాను. కానీ ప్రేక్షకులు నా సినిమాలు గొప్ప విజయాన్ని సాధించాయి. ప్రేక్షకులను అలరించడమే నా లక్ష్యం’’ అన్నారు.
“ప్రేక్షకుల మద్దతుతో, నా కెరీర్లో ఇప్పటివరకు నిరాశపరిచే రోజులు చూడలేదు. నేను చేసిన ఏ జానర్ సినిమాని వారు ఆదరించారు. వారి సపోర్ట్‌తో నా కెరీర్లో మంచి రోజులు, సంతోషకరమైన రోజులు అన్నీ చూశాను” అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పటాస్’తో దర్శకుడవ్వాలనే కోరిక తీరిందని, ఇప్పుడు అవన్నీ బోనస్ అని అన్నారు. చిరంజీవితో ఓ ఎంటర్టైనర్ సినిమా, నాగార్జునతో ‘హలో బ్రదర్’ లాంటి సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు.
Read : Nandamuri Balakrishna : డాకు మహారాజ్ సినిమా సక్సెస్ మీట్ లో పాట పాడిన బాలయ్య