Kushi Ravi : ప్రేక్షకుల ముందుకు రానుంది కొత్త కన్నడ సిరీస్ …‘అయ్యన మనే’’జీ 5’లో క్రైమ్ థ్రిల్లర్!

ayyanamane
  • ప్రేక్షకుల ముందుకు రానుంది కొత్త కన్నడ సిరీస్ …‘అయ్యన మనే’’జీ 5’లో క్రైమ్ థ్రిల్లర్!

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై క్రైమ్ థ్రిల్లర్‌లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జోనర్‌కి సంబంధించిన సిరీస్‌లు కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మిళితమైతే, ఆ రిస్పాన్స్ మరింత బలంగా కనిపిస్తుంది. అచ్చంగా అలాంటి కాంబినేషన్‌తోనే ప్రేక్షకుల ముందుకు రానుంది కొత్త కన్నడ సిరీస్ — ‘అయ్యన మనే’.

ఈ సిరీస్ ఏప్రిల్ 25 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఖుషి రవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో, అక్షయ నాయక్, మానసి సుధీర్, విజయ్ శోభరాజ్ వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శృతినాయుడు నిర్మించిన ఈ కథ, 1990ల కాలంలో ఒక ఉమ్మడి కుటుంబం నివసించే బంగ్లాను కేంద్రంగా సాగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల ఆసక్తిని రేపుతున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌కి మంచి స్కోప్ ఉన్న కంటెంట్ కావడంతో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్యూరియాసిటీ ఏర్పడింది.

రమేశ్ ఇందిర దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కథ ఇలా సాగుతుంది: చిక్ మగ్‌ళూర్‌లోని ఓ పురాతన భవనంలో ‘అయ్యన మనే’ అనే కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంటికి కోడలులుగా వచ్చిన ముగ్గురు యువతులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద రీతిలో చనిపోతారు. అయితే ఈ మరణాల్ని కుటుంబ సభ్యులు రహస్యంగా ఉంచుతారు. ఇదే ఇంట్లో నాలుగో కోడలిగా అడుగుపెట్టే ఖుషి రవి, ఆ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకుంటుంది. ఈ ప్రయత్నంలో ఆమె ఎలాంటి మిస్టరీలు ఎదుర్కొంది? నిజానికి ఆ మరణాల వెనక మిస్టరీ ఏమిటి? అన్నదే కథలో హైలైట్.

Read : Kalyan Ram : అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రివ్యూ 

Related posts

Leave a Comment