వివాదంలో జాట్’ సినిమా….సన్నీ డియోల్‌, రణ్‌దీప్ హూడాపై పోలీసు కేసు నమోదు!

jaat movie
  • వివాదంలో జాట్’ సినిమా….సన్నీ డియోల్‌, రణ్‌దీప్ హూడాపై పోలీసు కేసు నమోదు!

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జాట్’ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశం మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసిందని ఆరోపణల నేపథ్యంలో, జలంధర్ పోలీసులు సన్నీ డియోల్‌తో పాటు నటులు రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్‌లపై కేసు నమోదు చేశారు.

ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా, ఆయనతో పాటు నిర్మాతలపై కూడా భారతీయ న్యాయసంహిత సెక్షన్ 299 ప్రకారం కేసు నమోదైనట్లు సమాచారం.

ఫిర్యాదుదారుడి వాదన ప్రకారం, ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమాలో క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా ఓ సన్నివేశం ఉందట. యేసు క్రీస్తును అవమానించేలా ఆ సీన్ చిత్రీకరించబడిందని, గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పర్వదినాల సమయంలో సినిమా విడుదల చేయడం ఉద్దేశపూర్వకమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించే విధంగా ఉందని, దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నమని ఆరోపించారు.

ఓ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా, ప్రశాంత్ బజాజ్, జరీనా వహాబ్, రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి తారాగణం నటించగా, రణదీప్ హుడా ప్రతినాయక పాత్రలో మెప్పించారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో కూడా విడుదలైంది. మొదటి వారాంతంలోనే బాక్సాఫీస్ వద్ద రూ. 32 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Read : సన్నీ డియోల్ అవైటెడ్ యాక్షనర్ ‘జాట్’ టీజర్ రిలీజ్

Related posts

Leave a Comment