-
అయ్యప్ప స్వామిని దర్శించుకున్న హీరో కార్తి
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నిన్న రాత్రి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి చేసిన మొక్కులు చెల్లించుకుని పుణ్యం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల తాను స్వామి మాల ధరించానని, ఇరుముడి సమర్పించేందుకు శబరిమలకు వచ్చినట్టు తెలిపారు. “కన్నె స్వామిగా ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా స్వామి దర్శనానికి రావాలనుంది. పవళింపు సేవ సమయంలో స్వామిని దర్శించడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది,” అని భావోద్వేగంగా చెప్పారు.
ఇక మరో కోలీవుడ్ నటుడు రవి మోహన్ కూడా అయ్యప్ప దర్శనానికి శబరిమలకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ, “2015 నుంచి శబరిమలకు వస్తున్నాను. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు స్వామిని దర్శించుకున్నాను. అయ్యప్ప స్వామిపై నాకు గాఢమైన నమ్మకం ఉంది. మాల వేసుకున్నప్పటి నుంచి నా జీవితంలో ఎన్నో మంచి మార్పులు వచ్చాయి,” అని తెలిపారు.