Baahubali : అంతర్జాతీయంగా మరో ఘనత సాధించిన ‘బాహుబలి-1’ మూవీ

bahubali
  • అంతర్జాతీయంగా మరో ఘనత సాధించిన ‘బాహుబలి-1’ మూవీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ మరియు దర్శక దిగ్గజం ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్‌ భారతీయ సినీ పరిశ్రమను గ్లోబల్ స్టేజ్‌పై నిలబెట్టింది. ముఖ్యంగా టాలీవుడ్‌ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుకు తెచ్చాయి. తాజాగా ‘బాహుబలి – ది బిగినింగ్’ (బాహుబలి-1) అంతర్జాతీయంగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాహుబలి-1 సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ ఎపిక్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్పానిష్ భాషలో కూడా విడుదలైంది. స్పానిష్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌ తో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను మరింత విస్తృతమైన అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరవేసే లక్ష్యంతో నెట్‌ఫ్లిక్స్‌ ఈ ప్రయత్నాన్ని ప్రారంభించింది.

ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు అనుష్క శెట్టి, తమన్నా, రానా దాగుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, కిచ్చా సుదీప్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా, ఆర్కా మీడియా వర్క్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. 2015 జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కి అఖండ విజయం సాధించింది.

Read : Shiva RAjkumar : జైలర్ 2 లో బాలకృష్ణ కూడా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడిన శివరాజ్ కుమార్

Related posts

Leave a Comment