Varalaxmi Sarathkumar: ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

varalakshmi sharathkumar
  • ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎంత క్రేజ్ ఉందో, తమిళంలో అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ ఆనంది. రెబల్ రోల్స్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ ఎంతగా గుర్తింపు పొందిందో, సాఫ్ట్, ఎమోషనల్ పాత్రల్లో ఆనందికి అంతే గుర్తింపు ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా శివంగి.

డెవరాజ్ భరణి ధరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది. మర్డర్ కేసు చుట్టూ తిరిగే ఈ కథ, ఈ ఏడాది మార్చి 7న తమిళనాట థియేటర్లలో విడుదలైంది. ఇందులో జాన్ విజయ్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీకి సిద్ధమైంది. ఈ నెల 18వ తేదీ నుంచి ‘ఆహా తమిళ్’ ప్లాట్‌ఫారంలో స్ట్రీమింగ్ కాబోతోంది – దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది.

కథ విషయానికి వస్తే – సత్యభామ (ఆనంది) అనే యువతి ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె అందం కారణంగా workplace లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటుంది. తను తట్టుకొని ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఓ హత్య కేసులో అనుకోకుండా ఇరుక్కుంటుంది. ఆ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగుతుంది పోలీస్ ఆఫీసర్ (వరలక్ష్మి శరత్ కుమార్). ఆ హత్య వెనుక ఎవరు ఉన్నారు? కేసు ఛేదనలో వరలక్ష్మి పాత్రకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అన్నదే కథా సారాంశం.

Read : Shiva RAjkumar : జైలర్ 2 లో బాలకృష్ణ కూడా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడిన శివరాజ్ కుమార్

Related posts

Leave a Comment