-
‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో సమంత సొంత ప్రొడక్షన్ హౌస్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యారు. ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు అక్కడ కూడా ఘన విజయం సాధించాయి. టాలీవుడ్లో చివరిగా ఖుషి సినిమాలో కనిపించిన సమంత, తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ‘త్రాలాలా మూవింగ్ పిక్షర్స్’ పేరుతో స్వంత ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించిన సమంత, ఈ సంస్థ నుంచి తొలి చిత్రంగా శుభంను ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే, ఇందులో కామెడీతో పాటు హారర్ అంశాలు కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. కథలో మిస్టరీ టచ్‌ను అందిస్తూ, శోభనం గదిలో భార్యాభర్తల మధ్య సరదా సంభాషణతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పెళ్లికూతురు రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తుంది. ఈ టైమ్‌లో “సీరియల్ చూడటమేంటి?” అని పెళ్లికొడుకు అడుగుతాడే… పెళ్లికూతురు “ష్..” అంటూ సీరియస్‌గా చూస్తుంది. టీజర్ ఆసక్తిగా అనిపిస్తోంది. మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి!