Shivaji : శివాజీని ప్రశంసించిన చిరంజీవి

chirajveevi with shivaji
  •  శివాజీని ప్రశంసించిన చిరంజీవి

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తెర‌కెక్కించిన కోర్ట్ సినిమా ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శివాజీ పోషించిన మంగపతి పాత్ర ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరైంది. ఈ నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి తన నివాసానికి శివాజిని ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. “ఇలాంటి అద్భుతమైన పాత్రల ద్వారా నీ ప్రతిభను మరింత చాటుకోవాలి” అంటూ చిరంజీవి శివాజిని ప్రశంసించినట్టు సమాచారం.  గతంలో ఇంద్ర చిత్రంలో చిరంజీవి, శివాజీ కలిసి నటించగా, అప్పటి నుంచే వీరిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. చిరంజీవితో శివాజీ కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

చిరంజీవిని కలిసిన అనుభవంపై శివాజీ స్పందిస్తూ— “ఈ క్షణాలు నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. చిరంజీవి గారు కోర్ట్ సినిమాను చూసి అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం” అని తెలిపారు.  ఈ చిత్రంలో మంగపతి పాత్ర నెగటివ్ షేడ్స్ కలిగిన పాత్ర. తన కుటుంబ సభ్యురాలిని రక్షించే క్రమంలో చందు అనే యువకుడిని ఇబ్బంది పెట్టే ఈ క్యారెక్టర్‌ను శివాజీ ప్రతిభావంతంగా పోషించారు. కోర్ట్ సినిమా విజయంలో ఈ పాత్ర కీలకమైన పాత్రగా నిలిచింది.

Read : Priyadarshi : వసూళ్ల పరంగా దూసుకుపోతున్న ‘కోర్ట్’ మూవీ

Related posts

Leave a Comment