Malavika Mohanan : ప్రభాస్ తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను : మాళవిక మోహనన్

  • ప్రభాస్ తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను

దక్షిణాది చిత్రసీమలో కేరళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2013లో మలయాళ సినిమా ‘పెట్టం పోలె’ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం మాళవిక, రెబల్ స్టార్ ప్రభాస్‌కు జోడీగా ‘ది రాజా సాబ్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే, తమిళంలో ‘సర్దార్ 2’ సినిమాతో కూడా బిజీగా ఉంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాళవిక, ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. “ప్రభాస్ మంచితనం, సహృదయతకు నేను ఫిదా అయిపోయాను. ఆయనలాంటి గొప్ప వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఈ సినిమాలో అవకాశం రావడం నాకు లక్కీ ఫీల్ అయ్యింది. ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను” అంటూ మాళవిక చెప్పుకొచ్చింది.

ఇక ‘ది రాజా సాబ్’ హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుండగా, ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

Related posts

Leave a Comment