- ‘హరిహర వీరమల్లు’ విడుదల తేదీ మార్పు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర హరిహర వీరమల్లు సినిమా నుంచి హోలీ పండుగ సందర్భంగా మేకర్స్ భారీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి కొత్త విడుదల తేదీని ప్రకటించడంతో పాటు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. మే 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
తాజాగా విడుదలైన పోస్టర్లో పవన్ కళ్యాణ్‌తో పాటు కథానాయిక నిధి అగర్వాల్ గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ద్వారా చిత్రబృందం పవన్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇదివరకు ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, తాజా అప్డేట్ ప్రకారం విడుదల తేదీ మే 9కి మారింది.
ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 17వ శతాబ్దం నేపథ్యంలో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read : Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ఫ్యాన్స్ కి ఏఎం రత్నం గుడ్‌న్యూస్!