- గౌరీ స్ప్రత్‌తో ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్నాను : అమీర్ ఖాన్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గురువారం తన 60వ పుట్టినరోజును పురస్కరించుకుని మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌లతో ఉన్న స్నేహబంధం, అలాగే స్నేహితురాలు గౌరీ స్ప్రత్‌తో డేటింగ్ విషయాలు సహా అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తనకు గౌరీతో 25 ఏళ్లుగా స్నేహం ఉందని, గత ఏడాది కాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన గౌరీ, ప్రస్తుతం తన ప్రొడక్షన్ బ్యానర్‌లో పని చేస్తున్నట్లు ఆమిర్ తెలిపారు. ఆమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడని, తన వ్యక్తిగత జీవితం గురించి తెరిచి మాట్లాడటానికి వెనుకాడనని చెప్పాడు. 2021లో తన రెండో భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు రీనా దత్తాను వివాహం చేసుకుని, అనంతరం విడిపోయారు.
ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. “ఇది చాలా భారీ ప్రాజెక్ట్, స్క్రిప్ట్ పనులు ప్రారంభించడానికి ఒక బృందాన్ని సిద్ధం చేస్తున్నాం. అనేక అంశాలను పరిశీలిస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి” అని అన్నారు.
అలాగే, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్‌లతో తనకు మంచి అనుబంధం ఉందని, బుధవారం వారిద్దరిని కలిసినట్లు తెలిపారు. “మా ముగ్గురి కలయికలో ఒక సినిమా వస్తే ఎంత బాగుంటుందో! కానీ దానికి సరైన స్క్రిప్ట్ దొరకాలి. అందుకే ఇంకా వేచి చూస్తున్నాం” అని ఆమిర్ నవ్వుతూ చెప్పాడు.
Read : Vamshi : ఆకలితో రోడ్లపై తిరిగిన రోజులు ఉన్నాయి : డైరక్టర్ వంశీ