-
సెకండ్ ఇన్నింగ్స్ కోసం సిద్ధమవుతున్న నటి రంభ
90వ దశకంలో అచ్చమైన తెలుగు అందంతో టాలీవుడ్‌ను ఊపేసిన హీరోయిన్ రంభ. తన అపూర్వ సౌందర్యం, ఆకట్టుకునే నటనతో అగ్రహీరోలందరి సరసన మెరిసింది. తెలుగు కాకుండా, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల్లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. బాలీవుడ్‌లో కూడా తన ముద్ర వేసుకున్న ఆమె, అనంతరం వివాహం చేసుకుని సినిమాలకు విరామం ఇచ్చింది. సినీ పరిశ్రమకు దూరమైనా, అప్పటి ప్రేక్షకులు ఇప్పటికీ రంభను మరిచిపోలేకపోతున్నారు. అప్పటి తరం అభిమానులకు ఆమె ఇప్పటికీ ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పడంలో సందేహమే లేదు.
అలాంటి రంభ, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ— సినిమా తన తొలి ప్రేమ అని పేర్కొంది. రీఎంట్రీకి ఇది సరైన సమయమని భావిస్తూ, నటిగా కొత్తగా ఛాలెంజింగ్ రోల్స్ పోషించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ప్రాధాన్యత గల పాత్రలు చేస్తూ, ప్రేక్షకులతో మరింత గాఢంగా కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నానని తెలిపింది.
Read : Sikandar Teaser: సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ టీజర్ విడుదల