-
కూలీ సినిమా నుంచి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్
ముద్దుగుమ్మ పూజా హెగ్డేకు టాలీవుడ్లో ఆఫర్లు తగ్గినప్పటికీ… తమిళ్ ఇండస్ట్రీ లో మాత్రం వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రజనీ కాంత్ మరియు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ‘ సినిమాలో ఆమె అవకాశాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఆమె ఐటెం సాంగ్ చేస్తోంది. పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ విజయ్‌తో కలిసి ‘నాయగన్’ చిత్రంలో నటిస్తున్నది పూజా హెగ్డే.