Nani : ఒళ్లు గగుర్పొడిచేలా ‘హిట్-3’ విజువల్స్

nani hit 3
  • ఒళ్లు గగుర్పొడిచేలా ‘హిట్-3’ విజువల్స్
  •  నాని బర్త్డే సందర్భంగా ‘హిట్‌-3’ టీజర్ ను రిలీజ్ చేసిన మేక‌ర్స్‌

నేచుర‌ల్ స్టార్‌ నాని బర్త్డే సందర్భంగా ఆయ‌న హీరోగా న‌టిస్తున్న కొత్త సినిమా హిట్‌-3 టీజర్ ను మేక‌ర్స్‌ రిలీజ్ చేశారు. నాని స‌ర‌స‌న‌ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ ఈ క్రైమ్ థ్రిల్లర్ మే 1న విడుదల కానుంది. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌లో ఊహించని షాకులు బోలెడిచ్చారు. శ్రీన‌గ‌ర్ నేప‌థ్యంలో ఈ క‌థ ఉంటుంద‌ని టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది. అక్క‌డ జ‌రిగే వ‌రుస హ‌త్య‌లు.. పోలీస్ ఆఫీస‌ర్ అర్జున్ స‌ర్కార్ వాటిని ఎలా ఛేదించాడు అనే కోణంలో ఈ సినిమా ఉండ‌నుంది.

ఊర మాస్ పోలీస్ గా నాని భయంక‌రంగా ఉన్నాడు. రావు రమేశ్ లాంటి ఒకరిద్దరిని తప్ప ఇత‌ర పాత్ర‌ధారుల‌ను రివీల్ చేయకుండా టీజర్ కట్ చేశారు. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ‌రో స్థాయిలో ఉంది. మొత్తానికి ‘హిట్ 3 ది థర్డ్ కేస్’ ఆషామాషీగా ఉండదని మాత్రం అర్థమైపోయింది. ఇంత‌కుముందు నాని న‌టించిన‌ ‘దసరా’ సినిమా కంటే చాలా ఎక్కువనిపించే స్థాయిలో ‘హిట్ 3’ విజువల్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ‘హిట్’ యూనివ‌ర్స్‌లో భాగంగా ద‌ర్శ‌కుడు శైలేశ్ కొల‌ను మ‌రోసారి మోస్ట్ వ‌యొలెంట్ క‌థ‌తో వ‌స్తున్నారు.

 

Read : Chiranjeevi : డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమా లో చిరు సరసన రాణీ ముఖర్జీ ఎంపిక

Related posts

Leave a Comment