Movie Updates

Joju George: బడ్జెట్ తక్కువ .. వసూళ్లు 60 కోట్లు

మలయాళంలో జోజు జార్జ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పాణి’. దర్శకుడిగా ఆయనకు ఇదే మొదటి సినిమా. ఈ చిత్రం అక్టోబర్ 24న అక్కడి థియేటర్లలో విడుదలైంది. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందిన ఈ సినిమా కథాపరంగా మంచి మార్కులు కొట్టేసింది. అభినయ .. సాగర్ సూర్య .. అభయ హిరణ్మయి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ రివెంజ్ డ్రామా OTTకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 16 నుంచి ‘సోనీలివ్’లో ప్రసారం కానుందని అధికారిక ప్రకటన వెలువడింది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళం .. కన్నడ .. హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

ఈ చిత్రంలో జోజు జార్జ్ ‘గిరి’ పాత్రలో కనిపించనున్నారు. కథ త్రిసూర్ నేపథ్యంలో సాగుతుంది. రెండు ముఠాల మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ ప్రాంత ప్రజలు గడుపుతున్నారు. ఆ గొడవ గిరి దంపతులను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది వారి జీవితాలను ఎలా మారుస్తుంది? ఇదీ కథ.

Read : Hero Srikanth : విలన్ గానే మిగిలిపోతానని అనుకున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *