Movie Updates

Daaku Maharaaj: ‘డాకు మ‌హారాజ్’ ట్రైల‌ర్ ఫుల్ మాస్‌.. బాల‌కృష్ణ యాక్ష‌న్ అదుర్స్‌!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం ‘డాకు మహారాజ్‘. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. డాకు మహారాజ్ ట్రైలర్ యాక్షన్‌తో నిండి ఉంది. థమన్ అందించిన బీజీఎం ఓ రేంజ్ లో ఉంది. యాక్షన్‌, ఎమోషన్‌ రెండూ సమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాబీ ఎలివేషన్ సీన్స్ చేశాడు. బాబీ బాలకృష్ణను చాలా కొత్తగా చూపించాడు. ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి.

“ఒకప్పుడు రాజు ఉండేవాడు. చెడ్డవాళ్లంతా డాకు అని పిలిచేవారు. నాకు ఆయన మహారాజ్.” అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. బాలయ్యతో బాలయ్య చెప్పిన “ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్” అనే డైలాగ్ అలాగే ట్రైలర్ చివర్లో వచ్చే “మైఖేల్ జాక్సన్.. డేంజరస్” అనే డైలాగ్ కూడా పవర్ ఫుల్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా బాలకృష్ణ యాక్షన్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఈసారి కూడా పొంగల్ కి బాలయ్య మరో హిట్ కొట్టేస్తాడేమో అనిపిస్తుంది. 2023 సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డితో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read : Anurag Kasyap : హిందీ సినిమాలు చేస్తున్నాం కానీ.. హిందీ ప్రేక్షకులను పట్టించుకోవడం లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *