Movie Updates

SSMB29 : మొదలైన ఎస్ఎస్ రాజ‌మౌళి, మ‌హేశ్ బాబు కాంబినేషన్ ప్రాజెక్ట్ షురూ

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘SSMB29‘ పేరుతో ప్రమోట్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గా పూజా కార్యక్రమం జరిగినట్టు సమాచారం. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ గా జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి మహేష్ బాబు ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, సూపర్ స్టార్ రాబోయే చిత్రం కోసం ఇప్పటికే పూర్తి మేకోవర్ చేయించుకున్నాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కొత్త మహేష్ బాబును చూడబోతున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఇప్పటికే వెల్లడించారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కానున్నారు. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కెఎల్‌నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Read : Hero Srikanth : విలన్ గానే మిగిలిపోతానని అనుకున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *