Ram Charan: బాలయ్య తో రామ్ చరణ్ అన్ స్టాపబుల్
జనవరి 10న సంక్రాంతి సందర్బంగా విడుదల కానున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకి వస్తున్నట్లు తెలుస్తోంది.‘ఆహా’ ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. X ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ విషయంపై. ‘ఒరేయ్ చిట్టీ.. బాబూ వస్తున్నాడు.. రిసౌండ్ ఇండియా మొత్తం వినిపిస్తోంది’ అంటూ ఆహా ఎక్స్ అకౌంట్ నుంచి ఓ పోస్ట్ వచ్చింది. దీంతో నందమూరి, మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.
షోకి వచ్చే వారితో చాలా సన్నిహితంగా మాట్లాడి ఎవరికీ తెలియని పర్సనల్ విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బాలకృష్ణ. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ ఎలాంటి విషయాలు తెస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ షోకి చిత్ర బృందంలోని కొంతమందితో పాటు రామ్ చరణ్ అర్డాంగి ఉపాసన కూడా వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read : Keerthy Suresh : సమంత వల్లే తనకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చిందన్న కీర్తి