Srikanth Odela: చిరంజీవితో సినిమా గురించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంటరెస్టింగ్ కామెంట్స్
యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైనదని అన్నారు. ఈ యువ దర్శకుడికి చిరుకు వీరాభిమాని అన్న సంగతి కూడా తెలిసిందే.
చిరంజీవితో సినిమా గురించి శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఈరోజు ఆయనతో వర్క్ చేస్తున్నానంటే నమ్మలేకపోతున్నాను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇది చిరంజీవిగారి గతానికి భిన్నంగా ఉంటుంది. అంతేకాదు, సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. దాదాపు 48 గంటల్లో ఈ సినిమా స్క్రిప్ట్‌ని ఫైనల్ చేశాం. చిరు ఉత్సాహం నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. కారవాన్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నేను ఆయనకు అభిమానిని. ఒక్కసారి సెట్‌పైకి అడుగు పెట్టగానే నా సినిమాలో ఆయన ఓ పాత్ర మాత్రమే’’ అని శ్రీకాంత్ ఓదెల అన్నారు.
నానితో చేసిన మొదటి సినిమా ‘దసరా’ కథకు తన తండ్రి స్ఫూర్తి అని చెప్పాడు. తన తండ్రి చిన్నప్పుడు బొగ్గు గనుల్లో పనికి వెళ్లేవారని, ఆ స్ఫూర్తితోనే ఈ సినిమా కథ రాసుకున్నానని చెప్పారు. అయితే 2019లో విడుదలైన ‘బ్రోచేవారెవరురా’ సినిమా చూసిన తర్వాత మనసు మార్చుకుని సినిమాల్లోకి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పాడు. వెంటనే తన సర్టిఫికెట్లన్నీ పారేశానని శ్రీకాంత్ ఓదెల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీకాంత్ మొదట ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత 2023లో వచ్చిన ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా మారి.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం నానితో రెండో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరుతో ప్రాజెక్ట్‌ని చేపట్టనున్నారు.
Read : Chiranjeevi: తండ్రి వర్ధంతికి చిరంజీవి, కుటుంబం నివాళి