Movie Updates

Chiranjeevi: తండ్రి వ‌ర్ధంతికి చిరంజీవి, కుటుంబం నివాళి

ఈరోజు టాలీవుడ్ సీనియర్ నటుడు చిరంజీవి తండ్రి వెంకట్ రావు పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ తన ఇంట్లో తండ్రికి నివాళులర్పించారు. ఆయన పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తల్లి అంజనాదేవి, భార్య సురేఖ, సోదరుడు నాగేంద్రబాబుతో కలిసి చిన్నపాటి ప్రార్థనలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. స్వర్గంలో ఉన్న ఈ రోజున నాకు జన్మనిచ్చిన మహానుభావుడిని స్మరించుకుంటూ..’’ అని చిరు ట్వీట్ చేశారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యంగ్ హీరోలకు పోటీగా చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

 

Read : Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *