Movie Updates

Chiyaan Vikram : చియాన్ విక్రమ్ #Chiyaan63 అనౌన్స్‌మెంట్

_చియాన్ విక్రమ్, మడోన్ అశ్విన్, అరుణ్ విశ్వ,

_శాంతి టాకీస్ ప్రొడక్షన్ నెం 3 #Chiyaan63 అనౌన్స్‌మెంట్

వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్, మండేలా, మావీరన్ (తెలుగులో మహావీరుడు)చిత్రాలతో ప్రశంసలు అందుకునన్న క్రియేటివ్ డైరెక్టర్ మడోన్ అశ్విన్‌తో కొలాబరేట్ అవుతున్నారు. ఈ చిత్రానికి #Chiyaan63 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు, శాంతి టాకీస్‌ ప్రొడక్షన్ నంబర్ 3 గా నిర్మాత అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు,  ఈ కొలాబరేషన్ అశ్విన్ క్రియేటివిటీ, విక్రమ్ పవర్‌హౌస్ పెర్ఫార్మెన్స్ బ్లెండ్ చేసి మరపురాని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది.మడోన్ అశ్విన్ విక్రమ్ కు సరిపోయే సబ్జెక్ట్ తో సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది.
నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ..“దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన చియాన్ విక్రమ్ సర్‌తో కలిసి మా ప్రొడక్షన్ నంబర్ 3ని ప్రకటించడం మాకు చాలా సంతోషంగా వుంది. అతని ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. మనకు ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలు, సంచలనాత్మక చిత్రాలను అందించిన నటుడితో చేతులు కలపడం మాకు గౌరవం. ఈ చిత్రానికి మండేలా, మావీరన్‌లను అందించిన అత్యుత్తమ డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రొడక్షన్ హౌస్‌గా, మేము రెండవసారి మడోన్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. మేమంతా కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే చిత్రాన్ని అందించబోతున్నాం’ అన్నారు
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: చియాన్ విక్రమ్

Read : Hero Venkatesh:విక్టరీ వెంకటేష్ బర్త్‌డే స్పెషల్- ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రోమో రిలీజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *