వైరల్ : ప్రభాస్ “కల్కి” నుంచి మరో లీక్.!
ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న మాసివ్ వరల్డ్ లెవెల్ చిత్రం “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. మరి యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి గ్రాండ్ క్యాస్టింగ్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ లెవెల్లో ఉన్నాయి. అయితే ఈ చిత్రం విషయంలో మేకర్స్ ఎప్పటికప్పుడు వినూత్న ప్రమోషన్స్ ని కూడా చేస్తున్నారు కానీ సినిమా నుంచి వచ్చే లీక్స్ ని మాత్రం ఆపలేకపోతున్నారు.
గత కొన్నాళ్ల కితమే సినిమా నుంచి పలు స్టిల్స్ వీడియో విజువల్స్ కూడా లీక్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి కల్కి నుంచి వీడియో విజువల్స్ లీక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. సూపర్ సోల్జర్స్ పై సహా మరో సన్నివేశం ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ గా మారింది. మరి ఈ లీక్స్ విషయంలో మేకర్స్ ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నారో వారికే తెలియాలి. అలాగే ఈ లీక్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.