“పుష్ప” గాడి రూల్ అనుకున్న టైమ్ కే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం పార్ట్ 1 థియేటర్ల లో రిలీజ్ అయ్యి రెండేళ్లు దాటింది. పుష్ప 2 ది రూల్ ను ఎలాంటి వాయిదా పడనివ్వకుండా అనుకున్న టైమ్ కే, ఆగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో భారతీయ ప్రధాన బాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జాతర సీక్వెన్స్ ను మేకర్స్ పూర్తి చేయడం తో, మరికొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.
ఈ చిత్రం షూటింగ్ ను జూన్ వరకు పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందుకోసం మేకర్స్ నిరంతరం శ్రమిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, ఫాహద్ ఫజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, ధనంజయ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన రెగ్యులర్ అప్డేట్స్ పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.