బుల్లితెర పై మంచి టీఆర్పీ సొంతం చేసుకున్న రామ్ ‘స్కంద’
యువ నటుడు రామ్ పోతినేని హీరోగా శ్రీలీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పర్వాలేదనిపించే విజయం అందుకుంది.
థమన్ సంగీతం అందించిన ఈమూవీ అటు ఓటిటిలో బాగానే రెస్పాన్స్ అందుకోగా ఇటీవల ఈ మూవీని స్టార్ మా ఛానల్ లో ప్రసారం చేయగా దానికి మంచి టిఆర్పి రేటింగ్ లభించింది. కాగా ఈ మూవీకి 8.11 రేటింగ్ లభించడంతో టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. నిజానికి అదేరోజున అదే సమయానికి బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ కూడా వేరొక ఛానల్ లో ప్రసారం అయినప్పటికీ కూడా స్కంద ఈ రేటింగ్ అందుకోవడం విశేషం అంటున్నారు సినీ విశ్లేషకులు.