SS Rajamouli : అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ కి వచ్చిన వచ్చిన రాజమౌళి

ss rajamouli
  •  అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ కి వచ్చిన వచ్చిన రాజమౌళి

ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (ఆర్టీవో) సందర్శించారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించుకునే ఉద్దేశంతో ఆయన కార్యాలయానికి స్వయంగా వచ్చారు అని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (జేటీసీ) రమేష్ తెలిపారు.

లైసెన్స్ రెన్యూవల్ ప్రక్రియలో భాగంగా రాజమౌళి అవసరమైన దరఖాస్తు ఫారమ్‌పై సంతకం చేశారు మరియు డిజిటల్ ఫోటో కూడా తీశారు. అనంతరం నిబంధనల ప్రకారం ఆయనకు పునరుద్ధరించిన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులు అందజేశారు.

జేటీసీ రమేష్ ప్రకారం, రాజమౌళి ఈ లైసెన్స్‌ను ప్రత్యేకంగా తన తదుపరి సినిమా కోసం అవసరమైన విదేశీ ప్రయాణాల దృష్ట్యా రిన్యూవల్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రూపొందబోతున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో, విదేశాల్లో చిత్రీకరణకు సిద్ధంగా ఉండేందుకు అంతర్జాతీయ లైసెన్స్ అవసరం పడినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read : Rajamouli : ఆ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాను : రాజమౌళి

Related posts

Leave a Comment