Siddhu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో ‘జాక్’ టీజర్ రిలీజ్

jack teaser
  • సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో ‘జాక్’ టీజర్ రిలీజ్

సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఎస్‌వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎన్‌ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, రెండు పాట‌లు విడుద‌ల‌య్యాయి. తాజాగా మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు.

సిద్ధూ మార్కు కామెడీ టైమింగ్ ని వాడుకుంటూనే యాక్షన్, ఫన్ రెండింటిని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బ్యాలన్స్ చేసిన తీరు ఆసక్తి గొలిపేలా ఉంది. త‌న మిష‌న్ పేరు బ‌టర్‌ఫ్లై అంటూ సిద్ధూ సంద‌డి చేశారు. ట్రైలర్ చివర్లో రొమాన్స్ గురించి సిద్ధూ చెప్పే డైలాగులు, నాన్నగా నటించిన నరేశ్‌ తో పండించిన హాస్యం యూత్ ని టార్గెట్ చేసుకున్నాయి. అలాగే హీరోతో ప్ర‌కాశ్‌రాజ్ సంభాష‌ణ‌లు కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

Teaser

 

 Read : GV Prakash Kumar: పెట్టింది 20 కోట్లు… కానీ వచ్చింది 5 కోట్లు మాత్రమే

Related posts

Leave a Comment