-
రాజకీయాల్లో తాను సరిపోనని నటి రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు
ఒక పాడ్కాస్ట్లో రేణు దేశాయ్ రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, గతంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, పిల్లల భవిష్యత్తు కోసం ఆ అవకాశాన్ని వదులుకున్నానని చెప్పారు. అప్పట్లో రాజకీయాలు తన జీవితంలో భాగమవుతాయని అనుకున్నానని కానీ పరిస్థితులు అనుకూలించలేదని అన్నారు. “తన విధిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాను” అని పేర్కొన్నారు.
రెణు దేశాయ్ ప్రజల సేవలో సంతృప్తి పొందుతానని, ఒక చిన్నారి కూడా ఆకలితో ఉండకూడదన్నదే తన మనసులో కోరిక అని చెప్పారు. మన దేశంలో డబ్బు, ఆహారానికి కొదవ లేదని, వాటి సరైన పంపిణీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఏ పార్టీలో చేరినా దాన్ని ఖచ్చితంగా బహిరంగంగా ప్రకటిస్తానని, రహస్యంగా ఉంచే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. “నాకు నచ్చింది నేరుగా చెప్పే అలవాటు ఉంది” అని అన్నారు.
ఇదిలా ఉండగా, తన కొడుకు అకీరాను రామ్ చరణ్ సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారన్న వార్తలపై స్పందిస్తూ, ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఖండించారు. ప్రస్తుతం అకీరా ‘ఓజీ’ చిత్రానికి పని చేయడం లేదని స్పష్టం చేశారు. ఒక వేళ అతడు నటనలోకి రావాలనుకుంటే, ఆ నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టుతో అందరికీ తెలియజేస్తానని చెప్పారు.
Read : Allu Arjun : బన్నీతో దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న ‘ఏఏ22’ చిత్ర ప్రకటన