Praveena Kadiyala : గాయని ప్రవస్తి ఆరోపణలపై స్పందన వీడియో విడుదల చేసిన నిర్మాత ప్రవీణ

producer praveena
  • గాయని ప్రవస్తి ఆరోపణలపై స్పందన వీడియో విడుదల చేసిన నిర్మాత ప్రవీణ

వర్ధమాన గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలపై జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మరియు నిర్మాత ప్రవీణ్ కడియాల స్పందించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్పష్టతనిచ్చే వీడియోను ఆయన విడుదల చేశారు.

ప్రవీణ్ మాట్లాడుతూ, “షోలో గాయకులు ధరించే దుస్తులు వారు ఎంపిక చేసుకున్న పాటకు అనుగుణంగా డిజైన్ చేయిస్తాము. వ్యక్తిగతంగా ఎవరికైనా ప్రత్యేక దుస్తులు తయారు చేయము. బాడీ షేమింగ్‌కు మా వద్ద ఎటువంటి స్థానం లేదు” అని స్పష్టం చేశారు.

కాస్ట్యూమర్‌ తమపై “మీ శరీరానికి ఏ డ్రెస్సూ సరిపోదు” అన్నారని ప్రవస్తి చేసిన ఆరోపణపై స్పందిస్తూ, “అలాంటి వ్యాఖ్య తప్పు. కానీ అలాంటి ఘటన జరిగినట్లయితే వెంటనే నాతో లేదా షో డైరెక్టర్‌తో మాట్లాడాల్సింది. మేమెప్పుడూ ఎవరికైనా ఖచ్చితంగా ఇలా ధరించండి, అలా ధరించండి అని చెప్పం” అని పేర్కొన్నారు.

పాటల ఎంపిక విషయంలో కూడా ప్రవస్తి చేసిన ఆరోపణలపై స్పందించిన ప్రవీణ్, “ప్రతి షెడ్యూల్‌కు ముందు మా క్రియేటివ్ టీమ్ నాలుగు రకాల పాటలను ఎంపిక చేసి కంటెస్టెంట్లకు పంపుతుంది. ఛానల్‌కి హక్కులున్న పాటల ఆధారంగా, వారు అందులో నుంచి ఆరు పాటలను ఎంచుకోవచ్చు. వారు రిహార్సల్స్ పూర్తిచేసి సిద్ధమని చెప్పిన తరువాతే షూటింగ్ మొదలవుతుంది” అని వివరించారు.

షో నియమాలపై కూడా ఆయన స్పందిస్తూ, “జడ్జిమెంట్‌ను గౌరవించాలన్న విషయం కాంట్రాక్ట్‌లో స్పష్టంగా ఉంటుంది. ఆ ఒప్పందాన్ని పూర్తిగా చదివి ఉంటే ఇలాంటి అపోహలు రాలేవు” అన్నారు.

తన అభిప్రాయాన్ని ముగిస్తూ, “ఇలాంటి అపార్థాలు పక్కన పెట్టి, ప్రవస్తి తమ కెరీర్‌లో ఇంకా ఎక్కువ ఎత్తులకు చేరాలని కోరుకుంటున్నాను” అని శుభాకాంక్షలు తెలిపారు.

Read : పైంకిలి : పెద్ద స్క్రీన్ మీద ప్లాప్ కానీ స్మాల్ స్క్రీన్ మీద సూపర్ హిట్

Related posts

Leave a Comment