-
కుమారిడితో కలిసి హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ !
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్‌కి చేరుకున్నారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారు. కుమారుడి గాయం విషయం తెలిసిన వెంటనే పవన్ కల్యాణ్ వెంటనే సింగపూర్‌కి వెళ్లారు.
చికిత్స పూర్తయిన అనంతరం మార్క్ శంకర్‌కి సౌఖ్యం క్రమంగా మెరుగవడంతో పవన్, తన కుమారుడితో కలిసి తిరిగి హైదరాబాద్‌కి పయనమయ్యారు. ఈ ఉదయం ఆయన భార్య అన్నాలెజినోవా, కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం బయట పవన్ తన కుమారుడిని చేతుల్లో ఎత్తుకుని వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.