-
నిర్మాతగా నిహారిక కొణిదెల రెండో సినిమా ప్రకటించింది!
మెగా డాటర్ నిహారిక కొణిదెల గతేడాది ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ నుంచి కొత్త దర్శకుడు, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం రూ. 50 కోట్ల భారీ వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇప్పుడేమో, నిహారిక నిర్మాతగా తన రెండో చిత్రాన్ని ప్రకటించింది!
ఈ కొత్త చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా, సంగీత్ సోలో హీరోగా చేస్తున్న తొలి సినిమా ఇదే.
నిహారిక – సంగీత్ – మానస శర్మ కాంబో ఇదే ఫస్ట్ కాదు!
ఇది వరకే, నిహారిక నిర్మించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో ఈ ఇద్దరూ భాగమయ్యారు. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (జీ5) వెబ్‌సిరీస్‌కు మానస శర్మ రచయితగా, ‘బెంచ్ లైఫ్’ (సోనీ లివ్) వెబ్‌సిరీస్‌కు దర్శకురాలిగా పని చేశారు.
ఇప్పుడు, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న తాజా చిత్రంతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేయనున్నారు.
స్క్రీన్ ప్లే & ప్రొడక్షన్ టీం:
కథ & దర్శకత్వం: మానస శర్మ
కో-రైటర్ (స్క్రీన్ ప్లే & డైలాగ్స్): మహేశ్ ఉప్పల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేశ్
Read : GV Prakash Kumar: పెట్టింది 20 కోట్లు… కానీ వచ్చింది 5 కోట్లు మాత్రమే