-
లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న అర్జున్ చిన్న కూతురు
-
13 ఏళ్ల తర్వాత మా కల నెరవేరింది అంటూ పోస్ట్
ప్రముఖ సినీ నటుడు అర్జున్ చిన్న కూతురు అంజన త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఆమె తన ప్రేమికుడితో వివాహబంధంలోకి అడుగుపెడుతోంది. ఇటీవల ఈ జంట నిశ్చితార్థం వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు అంజన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. “13 ఏళ్ల తర్వాత మా కల నెరవేరింది” అని ఆమె భావోద్వేగంగా పేర్కొంది. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయ్యింది. నెటిజన్లు జంటకు హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు, అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య గత ఏడాది సినీ నటుడు ఉమాపతి రామయ్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.