Ajith Kumar : బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం

ajith kumar
  • బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ నెల 10న విడుదలైన ఈ యాక్షన్-కామెడీ థ్రిల్లర్, విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. అజిత్ కెరీర్‌లో 63వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో అజిత్ కుమార్ మూడు విభిన్న పాత్రల్లో — గుడ్, బ్యాడ్, అగ్లీ — అలరించారు. తమిళనాడులో ఈ చిత్రం విడుదలైన తొలి రోజు 2,400 ప్రదర్శనలతో సుమారు రూ. 28.5 కోట్ల వసూళ్లు రాబట్టి, ఈ ఏడాది తమిళ సినిమా పరిశ్రమలో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్ నమోదు చేసిన చిత్రంగా నిలిచింది.

యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ స్థాయి స్టంట్ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కించారని చిత్ర బృందం తెలిపింది. త్రిష కథానాయికగా, అర్జున్ దాస్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు.

ఇక డిజిటల్ హక్కుల విషయానికి వస్తే— నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రం స్ట్రీమింగ్ రైట్స్‌ను రూ. 95 కోట్లకు స్వాధీనం చేసుకుంది. మే నెల నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. దాదాపు రూ. 270-300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం, వసూళ్ల పరంగా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగితే, 2025లో టాప్ గ్లాస్ హిట్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read : Rajamouli : ఆ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాను : రాజమౌళి

Related posts

Leave a Comment