-
ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాడీగార్డు శివరాజ్ జీతం చూసి నెటిజన్లు షాక్!
సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు తమ భద్రత కోసం వ్యక్తిగత బాడీగార్డులను నియమించుకోవడం సాధారణమే. కానీ, మాజీ ప్రపంచ సుందరి, నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాడీగార్డు శివరాజ్ తీసుకుంటున్న వేతనం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
రెగ్యులర్ జీతమా? సీఈఓ స్థాయి పేమెంటా?
శివరాజ్ అందుకుంటున్న వేతనాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతని జీతం అనేక బహుళజాతి కంపెనీల సీఈఓల కంటే ఎక్కువ అంటూ చర్చ నడుస్తోంది. అసలేం జరుగుతుందంటే…
శివరాజ్ నెల జీతం: అక్షరాలా రూ.7 లక్షలు!
ఏడాదికి: రూ.84 లక్షలు ఐశ్వర్య రాయ్ నుంచి వేతనంగా అందుకుంటున్నాడట!
బచ్చన్ ఫ్యామిలీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి!
ఐశ్వర్య దేశం, విదేశం ఎక్కడికెళ్లినా శివరాజ్ వెన్నంటే ఉంటాడు. కేవలం బాడీగార్డు గానే కాదు, బచ్చన్ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నాడు.
అంతేకాదు, 2015లో శివరాజ్ వివాహానికి ఐశ్వర్య స్వయంగా హాజరై, కొత్త దంపతులను ఆశీర్వదించింది. దీనిని బట్టి బచ్చన్ ఫ్యామిలీ ఆయనను ఎంత ప్రత్యేకంగా భావిస్తుందో అర్థం చేసుకోవచ్చు!
Read : Niharika Konidela : తన రెండో సినిమాని ప్రకటించిన నీహారిక