Abhinaya: ఘనంగా నటి అభినయ వివాహం

sctress abhinaya
  • ఘనంగా నటి అభినయ వివాహం

బహుభాషా నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె తన చిరకాల స్నేహితుడు, హైదరాబాద్‌కి చెందిన వేగేశ్న కార్తీక్ (సన్నీ వర్మ)తో ఏడడుగులు వేశారు. జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుక ఘనంగా జరగగా, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

అభినయ, కార్తీక్ చిన్ననాటి నుంచే మంచి స్నేహితులు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారి, పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి వరకు చేరింది. అభినయ 2008లో పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘నేనింతే’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ముక్తి అమ్మన్’ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది.

అభినయ గతంలో తమిళ స్టార్ హీరో విశాల్‌తో కలిసి ‘మార్క్ ఆంటోనీ’ చిత్రంలో నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, రహస్యంగా నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ పుకార్లకు తావులేదని పేర్కొంటూ అభినయ స్పష్టతనిచ్చారు. అప్పట్లోనే తన ప్రియుడు కార్తీక్‌ను పరిచయం చేస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి గాసిప్స్‌కు చెక్ పెట్టారు.

ఇటీవల మార్చి 9న అభినయ–కార్తీక్ నిశ్చితార్థం జరగగా, నిన్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రిసెప్షన్ ఈ నెల 20న నిర్వహించనున్నట్టు సమాచారం.

Read : Varalaxmi Sarathkumar: ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ

Related posts

Leave a Comment