వివాదంలో జాట్’ సినిమా….సన్నీ డియోల్‌, రణ్‌దీప్ హూడాపై పోలీసు కేసు నమోదు!

jaat movie

వివాదంలో జాట్’ సినిమా….సన్నీ డియోల్‌, రణ్‌దీప్ హూడాపై పోలీసు కేసు నమోదు! బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జాట్’ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశం మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసిందని ఆరోపణల నేపథ్యంలో, జలంధర్ పోలీసులు సన్నీ డియోల్‌తో పాటు నటులు రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్‌లపై కేసు నమోదు చేశారు. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా, ఆయనతో పాటు నిర్మాతలపై కూడా భారతీయ న్యాయసంహిత సెక్షన్ 299 ప్రకారం కేసు నమోదైనట్లు సమాచారం. ఫిర్యాదుదారుడి వాదన ప్రకారం, ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమాలో క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా ఓ సన్నివేశం ఉందట. యేసు క్రీస్తును అవమానించేలా ఆ సీన్ చిత్రీకరించబడిందని, గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పర్వదినాల…

Read More

Kalyan Ram : అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రివ్యూ 

arjun son of vyjayanthi

అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రివ్యూ  అర్జున్ సన్నాఫ్ వైజయంతి — కల్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం తల్లీకొడుకుల మధ్య గాఢమైన ఎమోషన్ల నేపథ్యంలో సాగుతుంది. చాలా కాలం తర్వాత విజయశాంతి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో విడుదలైంది. ‘బింబిసార’ తర్వాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కల్యాణ్ రామ్‌కు ఇది బ్రేక్ ఇవ్వగలదేమో చూడాలి. కథా సారాంశం: కథ 2007లో విశాఖపట్నంలో మొదలవుతుంది. పోలీస్ కమిషనర్ వైజయంతి (విజయశాంతి) ఓ కఠినమైన, నిజాయితీ గల అధికారిణి. ఆమె భర్త విశ్వనాథ్ (ఆనంద్), తీర రక్షకదళంలో పనిచేస్తుంటాడు. వీరి కుమారుడు అర్జున్ (కల్యాణ్ రామ్), తల్లి కోరిక ప్రకారం ఐపీఎస్ కావాలనుకుంటాడు. శిక్షణ…

Read More

Hero Karthi : అయ్యప్ప స్వామిని దర్శించుకున్న హీరో కార్తి

hero karthik

అయ్యప్ప స్వామిని దర్శించుకున్న హీరో కార్తి కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నిన్న రాత్రి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి చేసిన మొక్కులు చెల్లించుకుని పుణ్యం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల తాను స్వామి మాల ధరించానని, ఇరుముడి సమర్పించేందుకు శబరిమలకు వచ్చినట్టు తెలిపారు. “కన్నె స్వామిగా ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా స్వామి దర్శనానికి రావాలనుంది. పవళింపు సేవ సమయంలో స్వామిని దర్శించడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది,” అని భావోద్వేగంగా చెప్పారు. ఇక మరో కోలీవుడ్ నటుడు రవి మోహన్ కూడా అయ్యప్ప దర్శనానికి శబరిమలకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ, “2015 నుంచి శబరిమలకు వస్తున్నాను. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు స్వామిని దర్శించుకున్నాను. అయ్యప్ప స్వామిపై నాకు గాఢమైన నమ్మకం ఉంది. మాల వేసుకున్నప్పటి నుంచి…

Read More

Mohanlal : OTT లోకి వస్తున్న ఎల్2: ఎంపురాన్… ఎప్పుడు, ఎక్కడంటే…!

l2

OTT లోకి వస్తున్న ఎల్2: ఎంపురాన్…. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. భారీ కలెక్షన్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 24 నుంచి జియో సినిమా (JioCinema) లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. గతంలో మోహన్‌లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లూసిఫర్’ కు ఇది సీక్వెల్. ‘ఎల్2: ఎంపురాన్’ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. Read : L2 Empuraan : ‘ఎల్‌-2 ఎంపురన్‌’ మూవీ రివ్యూ

Read More

Anjana Arjun: లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న అర్జున్ చిన్న కూతురు

anjana arjun

లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న అర్జున్ చిన్న కూతురు 13 ఏళ్ల తర్వాత మా కల నెరవేరింది అంటూ పోస్ట్ ప్రముఖ సినీ నటుడు అర్జున్ చిన్న కూతురు అంజన త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఆమె తన ప్రేమికుడితో వివాహబంధంలోకి అడుగుపెడుతోంది. ఇటీవల ఈ జంట నిశ్చితార్థం వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు అంజన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. “13 ఏళ్ల తర్వాత మా కల నెరవేరింది” అని ఆమె భావోద్వేగంగా పేర్కొంది. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయ్యింది. నెటిజన్లు జంటకు హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు, అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య గత ఏడాది సినీ నటుడు ఉమాపతి రామయ్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. Read : Varalakshmi Sharath Kumar : ‘శివంగి మూవీ రివ్యూ!

Read More

Varalakshmi Sharath Kumar : ‘శివంగి మూవీ రివ్యూ!

shivangi

 ‘శివంగి మూవీ రివ్యూ! వరలక్ష్మి శరత్‌కుమార్, ఆనంది ముఖ్యపాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘సివంగి’ మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. నరేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి భరణి ధరన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ‘సివంగి’ అనే టైటిల్ చూస్తే శక్తివంతమైన పాత్రలతో నిండిన సబ్జెక్ట్ ఉంటుందనిపిస్తుంది. కానీ అసలు కధలోకి వెళితే… కొంతంత నిరాశే మిగులుతుంది. కథ: సత్యభామ (ఆనంది) హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఆమె వివాహం రవీంద్రతో జరుగుతుంది. కొత్తగా ఫ్లాట్‌లో కాపురం మొదలైన క్షణాల్లే, రవీంద్ర ప్రమాదానికి గురవుతాడు. ఆ ప్రమాదం తర్వాత అతడు పూర్తిగా వైకల్యంతో బాధపడుతుంటాడు. అయినా సత్యభామ అతనిని వదిలిపెట్టకుండా సేవ చేస్తూ జీవితం కొనసాగిస్తుంది. వివాహ వార్షికోత్సవం రోజునే, అతనికి అవసరమైన…

Read More

Tamanna : ‘ఓదెలా 2’ – మూవీ రివ్యూ!

thamanna

‘ఓదెలా 2’ – మూవీ రివ్యూ! ఓదెల 2 – రెడీ మేడ్ సీక్వెల్‌… కాని కొత్తదనం లేదు! ఈ రోజుల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే కొత్త కథ రాయడం చాలా కష్టమైన పని. అందుకే చాలామంది దర్శకులు ఇప్పటికే విజయాన్ని సాధించిన సినిమాలకే సీక్వెల్‌లు తీసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కొన్ని సినిమాలు సీక్వెల్ రూపంలో విజయం సాధిస్తే, మరికొన్నిటి ప్రయాణం బాక్సాఫీస్‌ వద్ద అర్ధాంతరంగా ముగుస్తుంది. తాజాగా ఆ లైనప్‌లో చేరిన చిత్రం ‘ఓదెల 2’. ఓటీటీలో మంచి స్పందన పొందిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ చిత్రానికి ఇది కొనసాగింపు. ఈసారి మాత్రం కథ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. తమన్నా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్లకు వచ్చింది. కథ విషయంలో… కథ మొదటి భాగానికి నేరుగా కొనసాగింపుగా…

Read More

Baahubali : అంతర్జాతీయంగా మరో ఘనత సాధించిన ‘బాహుబలి-1’ మూవీ

bahubali

అంతర్జాతీయంగా మరో ఘనత సాధించిన ‘బాహుబలి-1’ మూవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ మరియు దర్శక దిగ్గజం ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్‌ భారతీయ సినీ పరిశ్రమను గ్లోబల్ స్టేజ్‌పై నిలబెట్టింది. ముఖ్యంగా టాలీవుడ్‌ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుకు తెచ్చాయి. తాజాగా ‘బాహుబలి – ది బిగినింగ్’ (బాహుబలి-1) అంతర్జాతీయంగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాహుబలి-1 సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ ఎపిక్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్పానిష్ భాషలో కూడా విడుదలైంది. స్పానిష్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌ తో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను మరింత విస్తృతమైన అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరవేసే లక్ష్యంతో నెట్‌ఫ్లిక్స్‌ ఈ ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో…

Read More

Abhinaya: ఘనంగా నటి అభినయ వివాహం

sctress abhinaya

ఘనంగా నటి అభినయ వివాహం బహుభాషా నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె తన చిరకాల స్నేహితుడు, హైదరాబాద్‌కి చెందిన వేగేశ్న కార్తీక్ (సన్నీ వర్మ)తో ఏడడుగులు వేశారు. జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుక ఘనంగా జరగగా, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అభినయ, కార్తీక్ చిన్ననాటి నుంచే మంచి స్నేహితులు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారి, పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి వరకు చేరింది. అభినయ 2008లో పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘నేనింతే’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ముక్తి అమ్మన్’ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. అభినయ గతంలో తమిళ స్టార్ హీరో విశాల్‌తో కలిసి ‘మార్క్ ఆంటోనీ’…

Read More

Dil Raju : ‘క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌’తో క‌లిసి దిల్ రాజు ఏఐ స్టూడియో

dil raju AI Studio

‘క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌’తో క‌లిసి దిల్ రాజు ఏఐ స్టూడియో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో మంగళవారం సాయంత్రం “బోల్డ్… బిగ్… బియాండ్ ఇమాజినేషన్” అంటూ ఒక ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ హింట్‌కి తగ్గట్టే, ఈరోజు ఉదయం 11:08కి సంస్థ నుంచి ఒక కీలక ప్రకటన వెలువడింది. ప్రఖ్యాత ఏఐ బేస్డ్ టెక్నాలజీ కంపెనీ క్వాంటమ్ ఏఐ గ్లోబల్తో కలిసి, ఒక ఆధునిక ఏఐ స్టూడియోను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వినోద పరిశ్రమ కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన అత్యాధునిక ఏఐ టూల్స్‌ను అభివృద్ధి చేయడమే ఈ కొత్త సంస్థ లక్ష్యమని తెలిపారు. ఈ స్టూడియో పేరుతో పాటు మరిన్ని వివరాలను మే 4న అధికారికంగా ప్రకటించనున్నట్టు…

Read More