- పెద్ద స్క్రీన్ మీద ప్లాప్ కానీ స్మాల్ స్క్రీన్ మీద సూపర్ హిట్
సాధారణంగా మలయాళ సినిమాలు తక్కువ బడ్జెట్‌తో వస్తుంటాయ్, కానీ వాటిలో ఉండే కథాబలం మాత్రం అమోఘం. చిన్న చిన్న బడ్జెట్లతో తెరకెక్కిన చిత్రాలు, వందల కోట్ల వసూళ్లను గెలుచుకుంటూ సక్సెస్ స్టోరీస్‌గా నిలుస్తుంటాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం అంచనాలకు భిన్నంగా ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాంటి సినిమాల జాబితాలో ‘పైంకిలి’ కూడా చేరిపోయింది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఏప్రిల్ 11 నుంచి ‘మనోరమా మ్యాక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అనశ్వర రాజన్, సాజిత్ గోపు ప్రధాన పాత్రల్లో కనిపించారు. శ్రీజిత్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా కథా విషయాల్లో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సుమారు 10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ చిత్రం, థియేటర్లలో మాత్రం కేవలం 6 కోట్ల వసూళ్లకే పరిమితమైంది. కానీ ఓటీటీ వేదికపై మాత్రం సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది, అదే విశేషం.
కథ విషయానికి వస్తే — అప్పుల బాధలో చిక్కుకున్న సుకుమార్, వాటి నుంచి బయటపడేందుకు మానసిక రుగ్మత కలిగిన వ్యక్తిలా నటించాల్సి వస్తుంది. ఇదే సమయంలో పెళ్లి పట్ల విరక్తి కలిగిన షీబా బేబీ, ఆ పరిస్థితుల్లో అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ సంబంధం, సుకుమార్ తన ప్లాన్‌ని ఎలా అమలు చేశాడు? అనేదే కథాంశం. ఈ విభిన్నమైన కాన్సెప్ట్నే ఓటీటీ ఆడియన్స్ బాగా కన్ెక్ట్ అవ్వడానికి కారణమై ఉండొచ్చు.
Read : వివాదంలో జాట్’ సినిమా….సన్నీ డియోల్, రణ్‌దీప్ హూడాపై పోలీసు కేసు నమోదు!