Ram Charan : దర్శకుడు బుచ్చిబాబుకు విలువైన బహుమతులు పంపించిన రామ్ చరణ్

  • దర్శకుడు బుచ్చిబాబుకు విలువైన బహుమతులు పంపించిన రామ్ చరణ్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 40వ ఏట అడుగుపెట్టారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుతూ, దర్శకుడు బుచ్చిబాబుకు విలువైన బహుమతులు పంపించారు. గిఫ్ట్‌లతో పాటు చరణ్ చేతిరాత లేఖను కూడా జోడించారు.

ఆ లేఖలో చరణ్ ఇలా పేర్కొన్నారు:

“బుచ్చి… హనుమాన్ చాలీసా నాకు జీవితంలో అత్యంత గొప్ప శక్తిని ఇచ్చింది. కఠినమైన సమయాల్లో కూడా హనుమంతుడిపై నాకున్న నమ్మకమే నన్ను నిలబెట్టింది. ఇప్పుడు నేను నా జీవితంలో 40వ అధ్యాయంలోకి అడుగుపెడుతున్న ఈ ఘట్టంలో ఆ శక్తిని కొంత నీతో పంచుకోవాలని కోరుకున్నాను. నా జీవితంలో నీకు ప్రత్యేక స్థానం ఉంది. నీవు ఎల్లప్పుడూ సుఖంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి దీవెనలు నీపై ఎల్లప్పుడూ ఉండాలి. ఈ బహుమతి కేవలం ఒక గిఫ్ట్ మాత్రమే కాదు – నీపై మాకున్న మమకారానికి ప్రతీక.” అని పేర్కొన్నారు

రామ్ చరణ్, ఉపాసన కలిసి పంపిన ఈ గిఫ్ట్‌ను స్వీకరించిన బుచ్చిబాబు, ఈ హృదయపూర్వక కానుక పై హర్షం వ్యక్తం చేశారు.

Read : Ramcharan : చెర్రీకి సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ చెప్పిన Jr. NTR

 

Related posts

Leave a Comment