-
జీవితంలో అద్భుతం జరగదు.. మనమే సృష్టించుకోవాలన్న తమన్నా
ఇండస్ట్రీలో ఎన్నేళ్లు గడిచినా మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల ఆమె గ్లామర్ డోస్ పెంచడంతో పాటు, స్క్రీన్‌పై మరింత బోల్డ్ అవతార్‌లో కనిపిస్తోంది. ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక గత మూడేళ్లుగా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా, ఇకrelationship ముగిసిందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. “జీవితంలో అద్భుతాన్ని ఎదురుచూడాల్సిన అవసరం లేదు… మనమే సృష్టించుకోవాలి” అంటూ సందేశాన్ని షేర్ చేసింది. అంతేకాదు, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా, రషా థడానీ, ప్రగ్యా కపూర్‌లతో కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలు కూడా పోస్ట్ చేసింది.
ఈ పోస్టును చూసిన నెటిజన్లు, తమన్నా బ్రేకప్ బాధ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.