Sree Vishnu : శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘మృత్యుంజయ్’  టైటిల్‌ టీజర్ విడుదల 

Mruthunjay మూవీ
  • శ్రీ విష్ణు కొత్త చిత్రం ‘మృత్యుంజయ్’  టైటిల్‌ టీజర్ విడుదల 

తరచుగా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కథానాయకుడు శ్రీ విష్ణు, తన ప్రత్యేకమైన శైలితో యువ హీరోలలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ప్రతిసారి విభిన్నమైన జానర్‌లను ఎంచుకుంటూ, తన నటనతో సినీ ప్రేమికులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరు‌కు పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనదిగా నిలుస్తున్న చిత్రం ‘మృత్యుంజయ్’.

ఈ చిత్రానికి షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. రమ్య గుణ్ణం సమర్పణలో, లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెబా జాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. టీజర్‌ను పరిశీలిస్తే, “గేమ్ ఓవర్ జయ్” అనే పవర్‌ఫుల్ డైలాగ్ వినిపిస్తోంది. అలాగే, శ్రీ విష్ణు ఇన్వెస్టిగేషన్ చేస్తుండే కీలక సన్నివేశాలు ఇందులో ఆకర్షణగా నిలుస్తాయి. ఇందులో ఆయన ఇన్వెస్టిగేటర్‌గా, ఖైదీగా ద్విపాత్రాభినయం చేస్తుండటం ఆసక్తికర అంశం. చివర్లో వచ్చే “నేను చెప్పే వరకు గేమ్ ఫినిష్ కాదు” అనే డైలాగ్, కథలో ఆయన పాత్రకు గంభీరతను ఇస్తుంది.

ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను శ్రీకర్ ప్రసాద్ నిర్వహిస్తుండగా, మనీషా.ఎ.దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.

 

Read : Pooja Hegde : కూలీ సినిమా నుంచి పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌ విడుదల చేసిన మేకర్స్

 

Related posts

Leave a Comment