Shihan Hussaini : న‌టుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కరాటే గురువు కన్నుమూత‌!

Shihan Hussaini
  • ప‌వ‌న్ కు మార్ష‌ల్ ఆర్ట్స్, క‌రాటే, కిక్ బాక్సింగ్ లో శిక్షణ ఇచ్చిన హుసైని

కోలీవుడ్ ప్రముఖ నటుడు షిహాన్ హుసైని (60) అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. హుసైని మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు.

హుసైని 1986లో విడుదలైన ‘పున్నగై మన్నన్’ చిత్రంతో కోలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అనేక సినిమాల్లో నటించినప్పటికీ, విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘బద్రి’ సినిమాతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

నటుడిగానే కాకుండా, హుసైని ప్రతిభావంతమైన ఆర్చరీ కోచ్‌గానూ గుర్తింపు పొందారు. 400 మందికి పైగా విద్యార్థులకు ప్రొఫెషనల్ శిక్షణ అందించిన ఆయన, మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ప్రావీణ్యం కలిగి ఉన్నారు.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు హుసైని మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ వంటి యోధ కళల్లో శిక్షణ ఇచ్చారు. ఆయన వద్ద శిక్షణ తీసుకుంటూనే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు.

Read : Pawan Kalyan: అభిమానుల మృతి… అయిదు లక్షలు ప‌రిహారం ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్

Related posts

Leave a Comment