- మార్చి 1న టీవీ, ఓటీటీ ప్రీమియర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని ZEE5, ZEE తెలుగు చానళ్లలో ఒకేసారి ప్రీమియర్‌గా ప్రదర్శించనున్నారు. రేపు (మార్చి 1) సాయంత్రం 6 గంటలకు ఈ వినోదభరిత చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
థియేటర్లలో ఘన విజయం సాధించిన అనంతరం, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ప్రత్యేకంగా ZEE తెలుగులో ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా, ZEE5 ఓటీటీ వేదికపై తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్‌లను కూడా విడుదల చేస్తున్నారు, తద్వారా విభిన్న భాషల ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు.
వెంకటేశ్ స్పందిస్తూ…
‘‘ఈ చిత్రంలో రాజు పాత్ర పోషించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అతని జీవిత ప్రయాణం, అనేక మలుపులు తిరిగే కథనంతో వినోదాన్ని పంచుతుంది. ప్రేక్షకులు థియేటర్లలో ఇచ్చిన స్పందన అసాధారణం. ఇప్పుడు ZEE5, ZEE తెలుగులో ఈ సినిమా ప్రసారం కానుండటంతో, టీవీ, ఓటీటీ ప్రేక్షకులు ఎలా ఆస్వాదిస్తారో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది కుటుంబ సమేతంగా చూసేందుకు అనువైన చిత్రం’’ అని అన్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ…
‘‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ZEE5, ZEE తెలుగులో విడుదల కావడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనది. వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, ఉపేంద్ర లిమాయేల అందించిన అద్భుతమైన నటన ఈ కథను మరింత మనోహరంగా మార్చింది. ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తూ అలరిస్తుంది. డ్యూయల్ రిలీజ్ ద్వారా మరింత మంది ప్రేక్షకులను చేరుకోవడం పట్ల సంతోషంగా ఉంది’’ అని తెలిపారు.
ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ…
‘‘భాగ్యలక్ష్మి పాత్ర నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. అమాయకత్వం, పొసెసివ్ నైచర్యం కలగలిసిన ఈ పాత్ర పోషించడం నాకు కొత్త అనుభవం. వెంకటేశ్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతి. ఈ చిత్రం OTT, టెలివిజన్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల కావడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరినీ నవ్వించే చిత్రమిది’’ అని చెప్పారు.
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ…
‘‘ఈ కథలో ‘మీనాక్షి’ అనే పాత్ర చాలా కీలకమైనది. కథలో కీలక మలుపులకు కారణమయ్యే ఈ క్యారెక్టర్‌కు థియేటర్లలో మంచి స్పందన లభించింది. ఇప్పుడు అదే మజాను టీవీ, ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులకు అందించనున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ZEE5లో రాబోతుండటంతో ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.