Sanchitha Basu: ఇప్పుడు అందరి దృష్టి ఈ ఓటీటీ క్వీన్ పైనే!

sanchita basu
  • ఇప్పుడు అందరి దృష్టి ఈ ఓటీటీ క్వీన్ పైనే!

ఒకప్పుడు ప్రతిభ ఉన్నవారు అవకాశాల కోసం ఎంతో కాలం ఎదురుచూడాల్సి వచ్చేది. నలుగురి దృష్టిలో పడటానికి సమయం తీసుకునే కాకుండా, తెరపై కనిపించే అవకాశాన్ని పొందినా, క్రేజ్ రావడానికి అదృష్టం అవసరమయ్యేది. అయితే, ఇప్పటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల వల్ల టాలెంట్‌ను ప్రదర్శించుకోవడం, అవకాశాలను ఆకర్షించుకోవడం ఎంతో వేగంగా మారింది. ఈ మార్పును సద్వినియోగం చేసుకుని వేగంగా ఎదిగిన అందగత్తెగా ‘సంచిత బసు‘ నిలుస్తోంది.

అందం, అల్లరి, హావభావాల విన్యాసం—ఈ మూడూ కలిస్తే సంచిత అని చెప్పొచ్చు. 2004లో బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌లో జన్మించిన ఆమె, ఇంటర్ చదివే రోజుల్లోనే ‘టిక్‌టాక్’ వీడియోల ద్వారా ఫేమస్ అయిపోయింది. అనంతరం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మరింత పాపులారిటీ సంపాదించింది. 2022లో తెలుగు సినిమాకు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ద్వారా కథానాయికగా పరిచయమైంది. అయితే, ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో అంతగా గుర్తింపు రాలేదు.

ఇప్పుడేమో, ముద్దుగా ముద్దమందారంలా మెరిసే సంచిత చుట్టూ వెబ్‌సిరీస్ అవకాశాలు తిరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘తుక్రా కే మేరా ప్యార్’ వెబ్‌సిరీస్ ఆమె క్రేజ్‌ను మరింత పెంచింది. ఈ సిరీస్‌లో ఆమె నటన హైలైట్‌గా నిలిచింది. ఫలితంగా అభిమానులు ఇప్పటికే ఆమెను ‘ఓటీటీ క్వీన్’గా సంబోధించడం ప్రారంభించారు. తెలుగు మాత్రమే కాదు, ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. అచ్చంగా అంజలి మాదిరిగా కనిపించే ఈ బ్యూటీ, ఏ రేంజ్‌లో బిజీ అవుతుందో చూడాలి!

Read : Chaava : ‘ఛావా’ తెలుగు ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది

Related posts

Leave a Comment