Ramcharan : ‘ఆర్‌సీ 16’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

rc16
  •  చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘RC 16‘ నుంచి భారీ అప్‌డేట్ వచ్చింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా,  ఉదయం 9.09 గంటలకు ఈ చిత్రపు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా, “యుద్ధంలో నిర్భయుడు.. మనస్సులో కనికరం లేనివాడు. రేపు ఉదయం 9.09 గంటలకు కలుద్దాం” అని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుండగా, శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ఆర్‌సీ 16. ఈరోజు చెర్రీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఫ‌స్ట్‌లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. అలాగే ముందు అనుకున్న‌ట్టే ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. 

‘పెద్ది’ ఫ‌స్ట్‌లుక్ సింప్లీ సూప‌ర్బ్‌గా ఉంది. గుబురు గ‌డ్డం, పొడ‌వాటి జ‌ట్టుతో చ‌ర‌ణ్ ఊర‌మాస్ లుక్‌లో అద‌ర‌గొట్టారు. ఈ చిత్రంలో చెర్రీ ప‌క్క‌న హీరోయిన్‌గా బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ న‌టిస్తుండ‌గా… శివ‌రాజ్ కుమార్, బాలీవుడ్ న‌టుడు దివ్యేందు, జ‌గ‌ప‌తి బాబు త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 

సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ఏఆర్ రెహమాన్ బాణీలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 

 

Read : Upasana Konidela : వాలెంటైన్స్ డే నాడు రామ్‌చ‌ర‌ణ్ అర్ధాంగి ఉపాస‌న ఆస‌క్తిక‌ర పోస్టు!

Related posts

Leave a Comment