-
‘రాబిన్ హుడ్’ రివ్యూ
వెంకీ కుడుముల – నితిన్ కాంబినేషన్లో వచ్చిన ‘భీష్మ’ హిట్ తర్వాత, ‘రాబిన్ హుడ్’పై అంచనాలు పెరిగాయి. అయితే, ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా?
కథ:
అనాథగా పెరిగిన రామ్ (నితిన్) అనాథాశ్రమాలకు సాయం చేసేందుకు అక్రమంగా సంపాదించిన డబ్బును దొంగిలిస్తూ ‘రాబిన్ హుడ్’గా మారతాడు. కానీ, అతని కోసం హోమ్ మినిస్టర్ స్పెషల్ ఆఫీసర్ విక్టర్ (షైన్ టామ్ చాకో)ను రంగంలోకి దింపుతాడు. ఇదే సమయంలో, ఓ ఊహించని కారణంతో నీరా (శ్రీలీల) భారతదేశానికి వస్తుంది. ఆమెకు రాబిన్ హుడ్ ఎలా కలిసి వస్తాడు? అసలు కథ ఏంటి? అనేది మిగతా స్టోరీ.
ప్లస్ పాయింట్స్:
-
నితిన్ హ్యాండ్సమ్ లుక్, శ్రీలీల ఎనర్జిటిక్ ప్రెజెన్స్
-
కొంతవరకు పని చేసిన వెన్నెల కిశోర్ కామెడీ
-
విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి
మైనస్ పాయింట్స్:
-
కథ సీరియస్ టైమ్లో కూడా అనవసర కామెడీ
-
విలన్స్ పాత్రలు బలహీనంగా ఉండటం
-
క్లైమాక్స్ లో ఆసక్తి తగ్గిపోవడం
వర్డిక్ట్:
ఫన్ మిక్స్డ్ యాక్షన్ మూవీగా రూపొందించినా, కథ అంతగా ప్రభావం చూపించలేకపోయింది. ఫ్యాన్స్కి ఓసారి చూసేందుకు సరిపోతుంది.