Priyadarshi : వసూళ్ల పరంగా దూసుకుపోతున్న ‘కోర్ట్’ మూవీ

court movie
  • రిలీజైన 10 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌కు చేరిన సినిమా

ప్రస్తుత సినిమాల ట్రెండ్‌ను పరిశీలిస్తే, పెద్ద తారాగణం లేకపోయినా లేదా భారీ బడ్జెట్‌తో రూపొందించకపోయినా, కథ బలంగా ఉంటే ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్న విషయం స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని నిరూపించే తాజా ఉదాహరణగా నేచురల్ స్టార్ నాని సమర్పణలో, ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన ‘కోర్ట్’ చిత్రం నిలిచింది.

ఈ నెల 14న విడుదలైన ‘కోర్ట్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మొదటి రోజే రూ.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, తాజాగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది.

మొత్తం పది రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసి, ప్రేక్షకుల ఆదరణను చారిత్రాత్మక తీర్పుగా పేర్కొంది.

రూ.9 నుండి రూ.10 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రానికి భారీగా లాభాలు వచ్చాయి. ఇక డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Read : Court Movie : జాబిల్లి పాత్రలో మెప్పించిన శ్రీదేవి

Related posts

Leave a Comment